అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తాం

ABN , First Publish Date - 2022-08-20T10:15:16+05:30 IST

సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు హెచ్చరించారు.

అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తాం

బండి సంజయ్‌ను హెచ్చరించిన శంభీపూర్‌ రాజు 

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. బండి సంజయ్‌ పాదయాత్ర ఆపేసి నిధుల కోసం కేంద్రంపై దండయాత్ర చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తలుచుకుంటే పాదయాత్ర ముందుకు సాగదని హెచ్చరించారు. మతాల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా బండి ప్రజలను రెచ్చగొడుతున్నారని, దమ్ముంటే సంక్షేమంపై మాట్లాడాలని  రాజు సవాల్‌ విసిరారు.  

Updated Date - 2022-08-20T10:15:16+05:30 IST