వేగంగా నడిస్తే...!

ABN , First Publish Date - 2020-12-14T20:03:20+05:30 IST

రోజూ కనీసం నలభై ఐదు నిమిషాల పాటు వాకింగ్‌ చేయడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మరీ నెమ్మదిగా కాకుండా వేగంగా నడిచినప్పుడే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు నిపుణులు.

వేగంగా నడిస్తే...!

ఆంధ్రజ్యోతి(14-12-2020)

రోజూ కనీసం నలభై ఐదు నిమిషాల పాటు వాకింగ్‌ చేయడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మరీ నెమ్మదిగా కాకుండా వేగంగా నడిచినప్పుడే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు నిపుణులు. 


స్పీడ్‌ వాకింగ్‌ వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది.


గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. 


రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్న వారికి స్పీడ్‌ వాకింగ్‌ మరింత మేలు చేస్తుంది.


కండరాలు బలోపేతం అవుతాయి. ఆర్థరైటిస్‌ సమస్య దరిచేరకుండా ఉంటుంది.


శ్వాసకోశ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. జలుబు, ఆస్తమాలాంటివి  దరిచేరవు.


శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిలు పెరుగుతాయి. కార్టిసాల్‌ లెవెల్‌ పెరుగుతుంది. 


యాంగ్జయిటీ, డిప్రెషన్‌ దూరమవుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. 


ఇతరులతో పోలిస్తే స్పీడ్‌ వాకింగ్‌ చేసే వారి జీవితకాలం పెరుగుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడయింది.


క్రియేటివ్‌గా ఆలోచించేందుకు వాకింగ్‌ దోహదపడుతుంది. ముఖ్యంగా అవుట్‌డోర్‌లో వాకింగ్‌ చేసే వారిలో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 

Updated Date - 2020-12-14T20:03:20+05:30 IST