ఒకే ఫోన్‌ ఇద్దరు వ్యక్తులు వాడాలంటే..

ABN , First Publish Date - 2021-01-09T06:38:44+05:30 IST

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే ఫోన్లలో పలురకాల యూజర్‌ ప్రొఫైళ్లు తయారు చేసుకునే సదుపాయం కల్పించారు.

ఒకే ఫోన్‌ ఇద్దరు వ్యక్తులు వాడాలంటే..

 ఎవరి సెట్టింగులు వారికి ఉండేలా ఏదైనా  అవకాశముంటే  తెలుపగలరు? 

- వినయ్‌


ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే ఫోన్లలో  పలురకాల యూజర్‌ ప్రొఫైళ్లు  తయారు చేసుకునే సదుపాయం కల్పించారు.  ఈ నేపథ్యంలో మీ ఫోన్లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి  మీ కుటుంబ సభ్యుల పేరిట  విడిగా ప్రొఫైళ్లని  క్రియేట్‌ చేయడం ద్వారా వారు మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం జోలికి రాకుండా..  అలాగే వారి సొంత ఫోటోలు,  వీడియోలు మీకు రాకుండా ఎవరికివారు విడి విడిగా ఒకే ఫోన్‌  వాడుకోవచ్చు. 


అంతేకాదు చిన్నపిల్లల పేరిట ఒక యూజర్‌ ప్రొఫైల్‌  క్రియేట్‌ చేస్తున్నట్లయితే వారు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుండి ఏ గేమ్స్‌ పడితే వాటిని డౌన్లోడ్‌  చేసుకోకుండా పరిమితులు విధించుకోవడానికి కూడా సాధ్యపడుతుంది.


మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం  ుnavya@andhrajyothy.com

Updated Date - 2021-01-09T06:38:44+05:30 IST