Abn logo
Feb 22 2020 @ 01:32AM

స్వేచ్ఛ ఉంటే మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తారు

స్వేచ్ఛ ఉంటే మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కథానాయిక, గాయని మంగ్లీ చెప్పారు. ఆమె నటించిన ‘స్వేఛ్ఛ ’ చిత్రం ట్రైలర్‌ను బుధవారం రాత్రి మీడియాకు ప్రదర్శించారు.   మంగ్లీ మాట్లాడుతూ ‘ మా కమ్యూనిటీల్లో జరిగే కథాంశంతో ఈ సినిమా తీశారు. ఒక యువతిని వాళ్ల నాన్న అమ్మేస్తే ఆమె బాగా చదువుకొని వచ్చి సొంతవూరుని బాగు చేస్తుంది. మా బంజారా కమ్యూనిటీలో ఈ సినిమా విడుదలై విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు మంగ్లీ.


చిత్ర నిర్మాత రాజూ నాయక్‌ మాట్లాడుతూ ‘ బంజరా భాషలో ‘గోర్‌ జీవన్‌’ పేరుతో ఈ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. అందుకే తెలుగులోనూ ఈ నెల 28న విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు బోలే, నిర్మాత సురేశ్‌ కొండేటి కూడా పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement