ధర తగ్గిస్తే ఎక్కువ తాగుతారు.. అందుకే పెంపు

ABN , First Publish Date - 2022-03-12T09:06:19+05:30 IST

మద్యం తక్కువ ధరలకు అందిస్తే, తాగేవారి సంఖ్య మరింత పెరుగుతుందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ చెప్పారు.

ధర తగ్గిస్తే ఎక్కువ తాగుతారు.. అందుకే  పెంపు

మద్యం ధరల పెంపుపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వ్యాఖ్యలు 

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మద్యం తక్కువ ధరలకు అందిస్తే, తాగేవారి సంఖ్య మరింత పెరుగుతుందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ చెప్పారు. మద్య నియంత్రణ కోసమే ధరలను పెంచుతున్నట్లు తెలిపారు. శాసనసభలో శుక్రవారం వివిధ పద్దులపై జరిగిన చర్చలో కాంగ్రెస్‌ పక్షనేత భట్టి విక్రమార్క, ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా రూ.17 వేల కోట్ల ఆదాయం మాత్రమే రాగా, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే రూ.37 వేల కోట్ల ఆదాయం వస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు.


ఆదాయం కోసం మద్యం ధరలను ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా పెంచుతుందన్నారు. రాష్ట్రంలో మద్యం బానిసలను తయారు చేశారని  శ్రీధర్‌బాబు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. దీనికి మంత్రి సమాదానం చెబుతూ.. తాగేవారి సంఖ్య తగ్గించాలన్న లక్ష్యంగానే ధరలు పెంచుతున్నట్లు తెలిపారు. రూ.30కే మద్యం అందిస్తే టీ, కాఫీ బదులు మద్యం సేవిస్తారన్నారు. దేశం మొత్తం మద్యపానాన్ని నిషేధిస్తే రాష్ట్రంలో కూడా నిషేఽధించేందుకు తాము సిద్ధమని తెలిపారు. 15-20 ఫీట్ల పొట్టి తాటిచెట్లను పెంచడానికి వ్యవసాయ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. 

Updated Date - 2022-03-12T09:06:19+05:30 IST