Abn logo
May 24 2020 @ 03:46AM

భౌతిక దూరం పాటించకుంటే రూ. 500 జరిమానా

 పీసీపల్లి, మే 23: దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకపోతే కిరాణ, చిల్లర దుకాణలు, బడ్డీ బంకుల యజమానులకు రూ. 500ల వరకు అపరాధ రుసుం వసూలు చేస్తామని స్థానిక పంచాయతీ సెక్రటరీ చాంద్‌బాషా అన్నారు. మండల కేంద్రమైన పీసీపల్లి మేజర్‌ పంచాయతీలో శనివారం దుకాణ యజమానులకు ఆయన నోటీసులు అందజేశారు. శుక్ర, శనివారం రెండు రోజుల్లో ఒక్క పీసీపల్లి పంచాయతీలో మాస్కులు ధరించ కుండా తిరుగుతున్న ప్రజల నుంచి వెయ్యి రూపాయలకు పైగా అపరాధ రుసుం వసూలు చేశారు.

Advertisement
Advertisement