రైతు బాగుంటేనే.. అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2022-05-17T04:37:30+05:30 IST

‘రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సీఎం జగన్‌ కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతూ.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం మండలం రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సోమవారం ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌’ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రైతు బాగుంటేనే.. అభివృద్ధి సాధ్యం
రైతులకు రైతుభరోసా-పీఎం కిసాన్‌ నిధులను పంపిణీచేస్తున్న స్పీకర్‌ సీతారాం

స్పీకర్‌ తమ్మినేని సీతారాం
రైతుభరోసా-పీఎం కిసాన్‌ నిధులు విడుదల
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 16 :
‘రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సీఎం జగన్‌ కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతూ.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం  మండలం రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సోమవారం ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌’ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని  నిర్వహించారు. జిల్లాలో 3,02,832 మంది రైతులకు రూ.167.50 కోట్లను జమ చేసినట్లుగా రూపొందించిన చెక్కును జేసీ విజయసునీతతో కలిసి రైతులకు పంపిణీ చేశారు. స్పీకర్‌ మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వెల్లడిస్తే పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. మాజీ డిప్యూటీ సీఎం, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ రైతు భరోసాకేంద్రాల్లో విత్తనం నుంచి పంట విక్రయాల వరకు ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్‌,  వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్‌, జిల్లా ఉద్యానవన అధికారి వరప్రసాద్‌, జడ్పీటీసీ రుప్ప దివ్య, కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని పరిశీలించారు.

Updated Date - 2022-05-17T04:37:30+05:30 IST