పరిహారం చెల్లించకపోతే భూమి స్వాధీనం చేసుకుంటాం

ABN , First Publish Date - 2022-09-29T06:20:29+05:30 IST

పవిత్ర సంగమం రహదారి భూ సేకరణ బాధితులు బుధవారం ఆందోళనకు దిగారు.

పరిహారం చెల్లించకపోతే భూమి స్వాధీనం చేసుకుంటాం
పవిత్ర సంగమం రహదారిని తవ్వేందుకు యత్నం

పవిత్ర సంగమం రహదారిని తవ్వేందుకు యత్నం 

సర్దిచెప్పిన అధికారులు

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 28: పవిత్ర సంగమం రహదారి భూ సేకరణ బాధితులు బుధవారం ఆందోళనకు దిగారు. ఏడు ఏళ్లగా పరిష్కారం కావటం లేదని నిరసన తెలిపారు. అనంతరం  రహదారిని తవ్వే ప్రయత్నం చేశారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు సమాచారం అందించటంతో వారికి నచ్చజెప్పారు. కృష్ణా పుష్కరాల సమయంలో రహదారి విస్తరణ కోసం భూ సేకరణ ప్రతిపాదనలు ప్రభుత్యానికి పంపామని అధికారులు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆరు నెలల్లో పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిందని బాధితులు అంటున్నారు. అధికారులకు, స్పందనలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటంలేదన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులను అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. అందుకనే మా భూమిని మేము తీసుకుంటున్నామన్నారు. భూమిని కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించకపోతే మా భూమిని స్వాధీనం చేకుంటామని మండవ మధు ప్రసాద్‌, దర్శి నాగరాజు చెబుతున్నారు. దీనిపై తహసీల్దార్‌ ఎం.సూర్యారావు వివరణ కోరగా భూ సేకరణ ప్రతిపాదనలు ప్రభుత్యానికి పంపిచామన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ నేత చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా బాధితులకు పరిహారం అందించటం లేదన్నారు. 


Updated Date - 2022-09-29T06:20:29+05:30 IST