సీఎం హామీ అమలు కాకపాయే

ABN , First Publish Date - 2022-05-22T04:54:07+05:30 IST

ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినా అమలుకాక పాయే అని ఫీల్డ్‌ అసిస్టెంట్లు(ఎఫ్‌ఏ)లు వాపోతున్నా రు.

సీఎం హామీ అమలు కాకపాయే

- ఉద్యోగాల కోసం ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఎదురుచూపులు 

- విధుల్లోకి తీసుకుంటామని  అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ ప్రకటన

- నెలలు  గడుస్తున్నా జారీ కాని ఉత్తర్వులు 

- అయోమయంలో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు

వనపర్తి రూరల్‌, మే 21: ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినా అమలుకాక పాయే అని ఫీల్డ్‌ అసిస్టెంట్లు(ఎఫ్‌ఏ)లు వాపోతున్నా రు.  నెలలు గడుస్తున్నా ఇంకా ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని వాపోతున్నారు. వనపర్తి జిల్లాలో 179 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ సంవత్సరంలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఈ సీజన్‌లోనే కూలీలకు అధికంగా పని దొరుకుతుంది. ఒక్కో గ్రామంలో వంద నుంచి అయిదు వందల మంది వరకు కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. కూలీల హాజరు, ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం వంటి పనులను మొన్నటి వరకు పంచాయతీ కార్యదర్శులు చూసేవారు. తాజాగా వారి నుంచి సీనియర్‌ మేట్లకు బాధ్యతలు అప్పగించారు. పనుల వివరాలు, కూలీల హాజరు పరిశీలన సీనియర్‌ మేట్లకు భారంగా ఉం దని  వాపోతున్నారు. ఏళ్లుగా పని చేస్తున్న తమకు వేతనాలు పెంచాలని అప్పట్లో క్షేత్ర సహాయకులు నిరవధికంగా ధర్నా చేయడంతో ప్రభుత్వం వారిని ఏకంగా విధుల నుంచి తొలగించింది. అప్పటి నుంచి వారు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందో ళనలు చేస్తున్నారు.  ఎఫ్‌ఏలను తొలగించిన తరువాత ఉపాధి పథకం కింద చేపట్టే పనుల పర్యవేక్షణ బాధ్యతను పూర్తిగా పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. అయితే పనిభారం కారణంగా బాధ్యతలకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నామని కార్యదర్శులు పలు మార్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లారు. దీంతో ఆ బాధ్యతలను సీనియర్‌ మేట్లకు అప్పగించారు. ఏది ఏమైనా సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెం ట్లు డిమాండ్‌ చేస్తున్నారు.





Updated Date - 2022-05-22T04:54:07+05:30 IST