నగరిని బాలాజీ జిల్లాలో చేర్చకుంటే ఉద్యమం : భానుప్రకాష్‌

ABN , First Publish Date - 2022-01-28T05:13:12+05:30 IST

ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో చేర్చకుంటే ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి భాను ప్రకాష్‌ పేర్కొన్నారు.

నగరిని బాలాజీ జిల్లాలో చేర్చకుంటే   ఉద్యమం :  భానుప్రకాష్‌
సమావేశంలో మాట్లాడుతున్న భానుప్రకాష్‌

పుత్తూరు టౌన్‌, జనవరి 27: ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో చేర్చకుంటే ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి భాను ప్రకాష్‌ పేర్కొన్నారు.  గురువారం ఆయన పుత్తూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ  ప్రజలందరూ ఉద్యమంలో ఏకం కావాలని పిలుపునిచ్చారు. భౌగోళికంగా, రవాణాపరంగా నగరి నియోజకవర్గ ప్రజలందరికీ సౌకర్యంగా ఉండేది తిరుపతేనని అన్నారు. కేబినెట్‌లో చర్చించకుండా  అశాస్ర్తీయంగా, ఏకపక్షంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంటూ హడావుడి చేయడం తగదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యదర్శి బాలాజి, చిత్తూరు పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు గంజి మాధవయ్య, అధికార ప్రతినిధి నల్లపనేని చినబాబు,  మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యుగంధర్‌, నాయకులు జానా వెంకటయ్య, జీవరత్నం నాయుడు, రవికుమార్‌, రమే్‌షబాబు, వెంకటేశ్వరరావు, రమే్‌షరాజు, మేమావతి, ధనపాల్‌, ఎ.బాలాజి, శ్రీనివాసన్‌ విజయకుమార్‌, షణ్ముగ రెడ్డి, సీనియర్‌ నాయకులు గంగాధర్‌నాయుడు, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:13:12+05:30 IST