AP News: కేంద్రంలో అధికారంలోకి వస్తే రూ. 500లకే వంట గ్యాస్ ..చింతా మోహన్

ABN , First Publish Date - 2022-09-20T16:54:50+05:30 IST

Vijayawada: కేంద్రంలో మేం అధికారంలోకి వస్తే 500లకే వంట గ్యాస్ పంపిణీ చేస్తామని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు. ఏపీ అబద్దాల ప్రదేశ్‌గా మారిందని, ఇతర రాష్ట్రాల కంటే అధ్వాన స్థితికి చేరిందని ధ్వజమెత్తారు. చింతా మోహన్ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

AP News: కేంద్రంలో అధికారంలోకి వస్తే రూ. 500లకే వంట గ్యాస్ ..చింతా మోహన్

Vijayawada:  కేంద్రంలో మేం (Congress) అధికారంలోకి వస్తే 500లకే వంట గ్యాస్ పంపిణీ చేస్తామని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chinata Mohan) పేర్కొన్నారు. ఏపీ అబద్దాల ప్రదేశ్‌గా మారిందని, ఇతర రాష్ట్రాల కంటే అధ్వాన స్థితికి చేరిందని ధ్వజమెత్తారు. చింతా మోహన్ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.


పేదలు మరింత పేదలుగా తయారయ్యారు

‘‘బీజేపీ (BJP) దేశానికి ఏమీ‌చేయకపోగా.. పేదలను మరింత పేదలుగా మార్చారు. . చిరుత పులులు తెప్పించి మోదీ గొప్పలు చెప్పుకోవడం కూడా ఒక ప్రగతేనా ? సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ ఫొటోలు పెడుతున్నారు. వాజపేయి, అద్వానీలు మీ నాయకులు కాదా ? వారిని గుర్తు చేసుకోరా ? అని ధ్వజమెత్తారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నా మోడీ స్పందించకపోవడం దారుణం. 2024 ఎన్నికలలో బీజేపీ వంద సీట్లుకే పరిమితం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం.’’  అని పేర్కొన్నారు. 


‘‘రాష్ట్రంలో విద్యా వ్యవస్థను జగన్ నాశనం చేశారు.’’

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను జగన్ (CM Jagan) భ్రష్టు పట్టించారు. స్కాలర్‌షిప్‌‌లు, హాస్టల్ ఛార్జీలు కూడా ఇవ్వడం లేదు. బోధనేతర పనులతో ఒక్క ఉపాధ్యాయుడు కూడా సంతృప్తి‌గా పని చేయలేని పరిస్థితి. ఒక్క ఛాన్స్ అంటే జగన్‌కి ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు మరొక్క ఛాన్స్ ఇస్తే జగన్‌ని సాగనంపేదుకు ఎదురు చూస్తున్నారు. ’’ అని పేర్కొన్నారు. 


రాహుల్ యాత్రకు విశేష స్పందన

‘‘రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. 2024‌లో కాంగ్రెస్ అధికారం‌లోకి రావడం ఖాయం. దేశంలో, రాష్ట్రం‌లో కాంగ్రెస్ అధికారం‌లోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాంగ్రెస్‌కు భవిష్యత్తు‌లో పూర్వ‌ వైభవం రావడం ఖాయం’’ అని చింతా మోహన్ పేర్కొన్నారు.



Updated Date - 2022-09-20T16:54:50+05:30 IST