ప్రమాదం రాత్రి 11.30 గంటలకు జరిగితే..

ABN , First Publish Date - 2020-06-30T16:02:59+05:30 IST

పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌లో ..

ప్రమాదం రాత్రి 11.30 గంటలకు జరిగితే..

విశాఖ:  పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌లో సోమవారం రాత్రి 11.30 గంటలకు గ్యాస్ లీక్ అయితే.. సుమారు మూడున్నర గంటల తర్వాత పోలీసులకు, బయటకు సమాచారం వచ్చింది. అంతవరకు ఈ ప్రమాదాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత గ్యాస్ లీక్ అనగానే విశాఖ వాసుల్లో కలవరం మొదలౌతోంది. ఎల్జీ పాలిమర్స్ ఘటనతో ఇప్పటి వరకు 15 మంది మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. వారికి భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.


తాజాగా రాత్రి సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌లో జరిగిన ప్రమాదం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఒకరు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి రాగి నాయుడు, కాగా గౌరీశంకర్ విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన జానకిరామ్, ఆనంద్ బాబు, సూర్యనారాయణ, ఐవి చంద్రశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతనిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలియవచ్చింది. ఈ ప్రమాదంలో సిబ్బంది నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తోంది.

Updated Date - 2020-06-30T16:02:59+05:30 IST