నెలకు పది వేల విద్యుత్తు వాహనాలు అమ్మగలిగితే...

ABN , First Publish Date - 2021-10-28T05:30:00+05:30 IST

దిగ్గజ వాహన కంపెనీ మారుతి సుజుకి లాభాలు సెప్టెంబరరు త్రైమాసికంలో 65 శాతం మేర తగ్గాయి.

నెలకు పది వేల విద్యుత్తు వాహనాలు అమ్మగలిగితే...

హైదరాబాద్ : దిగ్గజ వాహన కంపెనీ మారుతి సుజుకి లాభాలు  సెప్టెంబరరు త్రైమాసికంలో 65 శాతం మేర తగ్గాయి. ఇప్పటికీ రెండు లక్షల వాహనాలకు సంబంధించిన ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. మారుతి సుజుకి సెప్టెంబరు త్రైమాసికంలో రూ. 487 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికం లాభం రూ. 1,420 కోట్లతో పోలిస్తే ఇది 66 శాతం తక్కువ. చిప్స్ కొరతతో పాటు కమోడిటీ ధరలు పెరిగిన నేపధ్యంలో లాభం తగ్గినట్లు సంస్థ వెల్లడించింది. కార్యకలాపాల ఏకీకృత ఆధాయం రూ. 18,756 కోట్ల నుండి రూ. 20,551 కోట్లకు చేరుకుంది. మొత్తం వాహన విక్రయాలు 3,93,130 నుండి 3,79,541 కు తగ్గాయి. దేశీయ విక్రయాలు 3,70,619 నుండి 3,20,133 కు క్షీణించాయి. కాగా... కంపెనీ చరిత్రలో అత్యధికంగా ఓ త్రైమాసికంలో 59,408 వాహనాలు ఎగుమతి అయ్యాయి. 


సెప్టెంబరు చివరి నాటికి రెండు లక్షలకు పైగా ఆర్డర్లు పెండింగులో ఉన్నాయి. కాగా... 2025 తర్వాత విద్యుత్తు  వాహనాలను(ఎలక్ట్రానిక్ వెహికిల్స్) విడుదల చేస్తామని మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించారు. నెలకు కనీసం పది వేల విద్యుత్తు వాహనాలను విక్రయించే పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఈ విభాగంలోకి అడుగులు వేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో సీఎన్జీ మోడళ్ళకు డిమాండ్ పెరిగిందని, ఈ నేపధ్యంలో... వీటి ఉత్పత్తి పెంపుపై దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. నవంబరు నెలలో వాహన ఉత్పత్తి పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-28T05:30:00+05:30 IST