టీడీపీ ప్రతిఘటిస్తే....

ABN , First Publish Date - 2021-10-20T04:42:36+05:30 IST

పోలీసుల అండతో దాడులు చేస్తున్న వైసీపీపై టీడీపీ నేతలు ప్రతిఘటిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊ హించుకోవాలని కడప పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ప్రధాన కార్యాదర్శి కొత్తపు మునిరెడ్డి, తంబళగొంది సర్పంచు కొత్తపు లోకేశ్వరి, సీనియర్‌ టీడీపీ నేత కొత్తపు మునిరెడ్డి పేర్కొన్నారు.

టీడీపీ ప్రతిఘటిస్తే....
సమావేశంలో మాట్లాడుతున్న విజయ్‌కుమార్‌రెడ్డి

టీడీపీ కార్యాలయంపైదాడి దారుణం

ఇది చీకటి రోజు

రాష్ట్రపతి పాలన విధించాలి

అట్లూరు, అక్టోబరు 19: పోలీసుల అండతో దాడులు చేస్తున్న వైసీపీపై టీడీపీ నేతలు ప్రతిఘటిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊ హించుకోవాలని కడప పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ప్రధాన కార్యాదర్శి కొత్తపు మునిరెడ్డి, తంబళగొంది సర్పంచు కొత్తపు లోకేశ్వరి, సీనియర్‌ టీడీపీ నేత కొత్తపు మునిరెడ్డి పేర్కొన్నారు.

టీడీపీకి రాష్ట్రప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తున్నారన్నారు. టీడీపీని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక అణచివేయాలనే దోరణీతోనే ముఖ్యమంత్రి జగన్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పునరావృత మైతే  ప్రతిఘటించేందుకు సిద్దమని హెచ్చరించారు.

దాడి దారుణం

పులివెందుల టౌన్‌, అక్టోబరు 19: టీడీపీ కేం ద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడి దారుణమని కడప పార్ల మెంట్‌ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. పులివెందులలో ఆయన మా ట్లాడుతూ పార్టీ కార్యాలయంపై, టీడీపీ జాతీ య అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపైన దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్ర గవర్నర్‌, కేంద్ర హోంమంత్రి స్పందించి రాష్ట్రపతి పాలన విధించి, దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కడప పార్లమెంట్‌ తెలుగు యువత అధ్యక్షుడు పుత్తా ఎల్లారెడ్డి, తెలుగు రైతు జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యంలో చీకటిరోజు

బద్వేలు,అక్టోబరు 19: డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కార్యాలయంపై వైసీపీ రౌడీలు దాడిచేసి ధ్వంసం చే యడం ప్రజాస్వామ్యంలో చీకటిరోజని టీడీపీ పట్టణాధ్యక్షుడు వెంగళరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో ఆయన తీవ్రస్థాయిలో ఖండించారు. 

‘సీఎం, డీజీపీ రాజీనామా చేయాలి’

మైదుకూరు, అక్టోబరు 19: పార్టీ కేంద్ర కార్యా లయంపైనా పట్టపగలు వందలాది మందితో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌, డీఐజీ రాజీనామా చేయాలని టీటీడీ మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం రాత్రి ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అవినీతి, అరాచకంపై ప్రశ్నిస్తే టీడీపీ నేతలపై దాడులు చేశారని, కార్యాల యాలపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు.

నిందితులను శిక్షించాలి

చాపాడు, అక్టోబరు 19: టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేసి శిక్షించాలని జిల్లా అధికార ప్రతినిధి మునిశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా దొరుకుతున్న విషయమై పట్టాభి మాట్లాడితే వైసీపీ వారికి ఉలుకుపాటెందుకన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలను పోలీసులు ఆపాలన్నారు. 

‘ప్రశ్నించే హక్కు లేదా’

దువ్వూరు, అక్టోబరు 19: సమాజంలో చెడు పై  ప్రశ్నించే హక్కు లేదా అంటూ దువ్వూరు మండల టీడీపీ కన్వీనర్‌ బోరెడ్డి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేయడం సమంజసం కాదన్నారు. అధికార బలంతో విర్రవీగుతున్న వైసీపీకి చెడురోజులు దగ్గరపడ్డాయన్నారు.

Updated Date - 2021-10-20T04:42:36+05:30 IST