ఇలా అయితే ఎలా..?

ABN , First Publish Date - 2021-11-28T06:19:27+05:30 IST

హంద్రీనీవాలో ఎత్తిపోతలు నిదానించాయి. అధిక వర్షాల కారణంగా హంద్రీనీవాలో ఎత్తిపోతలను ఒక మోటారుకు పరిమితం చేశారు.

ఇలా అయితే ఎలా..?
హంద్రీనీవా కాలువలో తగ్గిన నీటి ప్రవాహం

హంద్రీనీవాలో తగ్గిన నీటి పంపింగ్‌

ఒక మోటారుతోనే ఎత్తిపోతలు 

వర్షాలు ఆగినా పెరగని నీటి పారుదల  

ఇప్పటిదాకా జిల్లాకు 19 టీఎంసీల చేరిక

ఈ ఏడాది 40 టీఎంసీలు దక్కడం గగనమే

గుంతకల్లు, నవంబరు 27: హంద్రీనీవాలో ఎత్తిపోతలు నిదానించాయి. అధిక వర్షాల కారణంగా హంద్రీనీవాలో ఎత్తిపోతలను ఒక మోటారుకు పరిమితం చేశారు. ఆగస్టులో నీటి ఎత్తిపోతలు ప్రారంభమైనపుడు ఆరు మోటార్లతో 1,950 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. ఇప్పటిదాకా 26 టీఎంసీల నీటిని పంపుచేయగా, జిల్లాకు 19 టీఎంసీలు చేరాయి. కాగా నవంబరు మూడో వారం నుంచి భారీ వర్షాలు కురవడం, ఇనలెట్ల నుంచి భారీ నీరు వచ్చి కాలువలో చేరుతుండటంతో గండ్లు పడతాయనే భయంతో అధికారులు నాలుగు రోజుల కిందట హంద్రీనీవాలో పంపింగ్‌ను తగ్గించేశారు. ప్రస్తుతం ఒక పంపుతో నీటిని ఎత్తిపోస్తుండగా, జిల్లాలోకి 268.02 క్యూసెక్కుల నీరు వస్తోం ది. దీంతో జిల్లాలోని రాగులపాడు వద్ద ఉన్న సిస్టంలోని 8వ పంపు హౌస్‌లో కూడా ఒక పంపును వినియోగించి ఎగువను నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్ర స్తుతం మరో తుపాను పొంచి ఉందన్న వార్తల కారణంగా పంపుల సంఖ్యను పెంచడంలేదు. 


గండ్ల భయంతోనే..

హంద్రీనీవాలో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కాలువ గట్లు పలుచోట్ల బలహీనంగా ఉండటంతో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా హెచఎనఎ్‌సఎ్‌సలో నీటి పంపింగ్‌ను అధికారులు పరిమితం చేశారు. జిల్లాలోని కసాపురం, జీ కొట్టాల, పీసీ ప్యాపీలి తండా, తదితర ప్రాంతాల్లో ఉన్న మట్టి కట్టలు బలహీనంగా ఉండటంతో నీటి ప్రవాహంలో ఇనలెట్ల ద్వారా వర్షపు నీరు కూడా వచ్చి చేరిందంటే గండ్లు తప్పవన్న భయంతో ఎత్తిపోతలను అధికారులు తగ్గించేశారు. గతంలో కర్నూలు జిల్లాలోనూ, అనంత పురం జిల్లాలో జీ కొట్టాల-కసాపురం గ్రామాల మధ్య గండ్లు పడ్డాయి. కొట్టాల గ్రామం వద్ద మట్టి కట్టలు కాలు వలోకి జారిపోయాయి. వాటికి తాత్కాలిక మరమ్మతులు చేశా రు. కాలువ నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉండటంతో కంపచెట్లు పెరిగిపోయాయి. గట్లు కోతకు గుర య్యాయి. వాటికి మరమ్మతులు చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు.


గత రికార్డు దాటేనా?

హంద్రీనీవాలో కిందటి సంవత్సరం గరిష్టంగా 40 టీఎంసీలను దాటి నీటిని పంపింగ్‌ చేశారు. ఈ సంవత్సరం ఆ స్థాయిలో నీటిని హంద్రీనీవాలో పారించగర న్న నమ్మకం సడలుతోంది. అధిక వర్షాలు కురిసినా డ్యాంలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. శ్రీశైలం డ్యాం ద్వారా జల ఉత్పాదన కారణంగా జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 130 టీఎంసీ నీరు మాత్రమే ఉండటంతో పవర్‌ జనరేషనను నిలిపివేశారు. ప్రస్తుతం 867 అడుగుల స్థాయిలో నీరు ఉంది. హంద్రీ నీవాలో నీటి ఎత్తిపోతలు కొనసాగాలంటే 836 అడుగుల వరకూ మాత్రమే సాధ్యపడుతుంది. అంటే మరో 31 అడుగుల వరకు మాత్రమే హంద్రీనీవాకు నీటి లభ్యత ఉంటుంది. నీటి నిల్వలు తగ్గినా ప్రత్యామ్నాయంగా ఉన్న కేసీ కెనాల్‌కు అనుబంధంగా ఉన్న ముచ్చుమర్రి పంపు హౌస్‌నుంచి నీరిచ్చే అవకాశాలున్నా భారీ స్థాయిలో నీటిని అందివ్వలేరు. ఈ పరిస్థితులను గమనిస్తే ఈ సంవత్సరం హంద్రీనీవాకు 40 టీఎంసీల స్థాయిలో నీటిని ఇవ్వడం కుదరకపోవచ్చు.

Updated Date - 2021-11-28T06:19:27+05:30 IST