ఎక్కువ సమయం కూర్చుంటే..!

ABN , First Publish Date - 2021-04-11T05:30:00+05:30 IST

గంటల తరబడి కదలకుండా కూర్చున్నట్లయితే అనేక సమస్యలు వచ్చిపడే అవకాశం ఉందని అంటున్నారు వైద్యనిపుణులు

ఎక్కువ సమయం కూర్చుంటే..!

గంటల తరబడి కదలకుండా కూర్చున్నట్లయితే అనేక సమస్యలు వచ్చిపడే అవకాశం ఉందని అంటున్నారు వైద్యనిపుణులు. 

  • ఎక్కువ గంటలు కూర్చుని ఉండటం వల్ల రక్తనాళాల్లో క్లాట్స్‌ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ క్లాట్స్‌ మెదడులోకి చేరి స్ట్రోక్‌కు కారణమయ్యే అవకాశం ఉంది.
  • రోజులో ఎక్కువ సమయం కూర్చుని ఉంటున్నట్లయితే పల్మనరీ ఎంబాలిజం అనే సమస్య ఉత్పన్నం కావచ్చు. కాళ్లలో ఏర్పడిన క్లాట్స్‌ ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లోకి చేరి అడ్డుపడతాయి. 
  • ఎక్కువ సమయం కూర్చుని ఉన్నట్లయితే ఒబేసిటీ, కోలన్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఫ్యాట్‌ను కరిగించాల్సిన బాధ్యత కండరాల్లోని రక్తనాళాల్లో ఉన్న ఎంజైమ్స్‌పై ఉంటుంది. అయితే గంటల కొద్దీ కూర్చోవడం వల్ల ఈ జీవక్రియల్లో తేడా వస్తుంది. 
  • కాళ్లు తిమ్మిర్లు రావడానికి కారణం రక్తసరఫరా సరిగ్గా లేకపోవడమే. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల నరాలు డ్యామేజ్‌ కావడం, నరాలపై ఒత్తిడి పడటం జరుగుతుంది. 
  • తరచుగా నడిచే వారితో పోల్చితే ఎక్కువ సమయం కూర్చుండే వారిలో డయాబెటిస్‌, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
  • ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల వెన్నుపై ఒత్తిడి పడుతుంది. కొంత కాలం తరువాత డిస్క్‌లు కంప్రెస్‌ అవుతాయి. ఒత్తిడి మూలంగా కండరాలు బిగుసుకుపోతాయి. 

Updated Date - 2021-04-11T05:30:00+05:30 IST