హోం మంత్రి పదవి అడిగితే ఇచ్చేస్తా: సుఖ్జిందర్

ABN , First Publish Date - 2022-01-03T20:45:58+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోరితే తన హోం మంత్రి పదవిని..

హోం మంత్రి పదవి అడిగితే ఇచ్చేస్తా: సుఖ్జిందర్

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోరితే తన హోం మంత్రి పదవిని నిమిషాల్లో వదులుకోవడానికి సిద్ధమని ఆ రాష్ట్ర హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి సుఖ్జీందర్ సింగ్ రంధావా తెలిపారు. సోమవారంనాడిక్కడ మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సుఖ్జీందర్ సమాధానమిస్తూ, తాను హోం మంత్రి పదవిని చేపట్టినప్పటి నుంచి సిద్ధూ అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఒకవేళ హోం శాఖ కావాలని సిద్ధూ కోరుకుంటే క్షణంలో ఆ పదవిని అతని పాదాల ముందు ఉంచుతానని అన్నారు.


ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైన సాద్ నేత బిక్రమ్ సింగ్ మజితియా కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు సుఖ్జీందర్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బిక్రమ్ సింగ్‌కు పోలీసు భద్రత లేనందున ఆయన ఆచూకీ పోలీసులకు తెలుసనే వాదన సరికాదని అన్నారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం, బిక్రమ్ సింగ్ పంజాబ్‌లో లేరని, స్వర్ణదేవాలయం దగ్గర అతను కనిపించినట్టు చెబుతున్న వీడియోలు, ఫోటోలు నకిలీవని తెలిపారు. పంజాబ్‌లో ఆయన ఎక్కడ కనిపించినా క్షణాల్లో ఆయనను జైలుకు పంపుతామని సుఖ్జీందర్ అన్నారు.

Updated Date - 2022-01-03T20:45:58+05:30 IST