నా కళ్ళతో చూస్తే... చాలా అవకాశాలు కనిపిస్తాయి...

ABN , First Publish Date - 2020-09-29T22:00:22+05:30 IST

భారత్ లో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన కార్యకలాపాలను నిలిపివేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన వెలువడింది. తమ బ్యాంకు ఖాతాలను భారత ప్రభుత్వం అప్రజాస్వామికంగా సీజ్ చేసిందని అమ్నెస్టీ ఇండియా ఆరోపించింది. ఈ నెల పదో తేదీన తమ బ్యాంకు ఖాతాలన్నింటినీ ఈడీ పూర్తిగా స్తంభింపజేసిందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

నా కళ్ళతో చూస్తే... చాలా అవకాశాలు కనిపిస్తాయి...

అహ్మదాబాద్ : రూపాయి పెట్టుబడికి ఎనిమిది వందల రెట్లు ఫలితం. నమ్మశక్యంగా లేదు కదూ. ఇది నిజమే. అయితే అందుకు పట్టిన సమయం కూడా తక్కువేమీ కాదు. ఎప్పుడో పాలికేళ్ళ క్రితం... అంటే  1994 వ సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు అదానీ ఎంటర్‌ప్రైజెస్ లో కేవలం ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేసిన వారికి... ఇప్పుడు రూ. 800 చొప్పున రిటర్న్స్ వచ్చాయి.


ఆ సమయంలో వాటాదారులు పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడి 800 రెట్ల మేరకు పెరిగిందని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయాన్ని వెల్లడించారు. అదాని గ్రూపునకు చెందిన ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తమ సంస్థల్లో వేల మందికి ఉద్యోగాలను కల్పించామని చెప్పారు.


ఇక... షేర్ హోల్డర్ల వ్యాల్యూను కూడా అసాధారణ స్థాయికి పెంచామన్నారు. కళాశాల విద్యను మధ్యలోనే నిలిపివేసిన అదానీ... మొదట్లో కమోడిటీ ట్రేడింగ్‌తో తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం అదానీ గ్రూప్‌ పేరుతో వివిధ వ్యాపారాల్లోకి అడుగు పెట్టారు. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఇంధనరంగ వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూప్ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద నౌకాశ్రయనిర్వహణదారుగా నిలదొక్కుకోవడం విశేషం.


ఇంధనం, మైనింగ్, గ్యాస్, పునరుత్పాదక ఇంధనశక్తి, రక్షణ, వ్యవసాయ కమోడిటీ వ్యాపారాలను అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది. భారత్‌లో మౌలిక సదుపాయాల వృద్ధిలో తమ వంతు సహకారాన్నందించడమే తమ ప్రధాన లక్ష్యమని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.


ఇక మరో ముప్ఫై ఏళ్ళలో... భారత్ రెండో దిగ్గజ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని గౌతమ్ అదానీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాపారావకాశాల విషయంలో భారత్ మెరుగ్గా ఉందన్నారు. ఒక వ్యాపారవేత్తగా తాను నిత్యం ఆశావహంగా ఉంటానని వ్యాఖ్యానించారు.


తన కళ్ళతో చూస్తే, చాలా అవకాశాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. కాగా... భారత్ ఎదుట ప్రస్తుతం పెను సవాళ్లున్నాయన్నారు అదానీ. ఇక... రానున్న పదేళ్ల కాలంలో రెండు లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమని తెలిపారు. కాగా... స్వల్పకాలిక ఆలోచనలతో దీర్ఘకాలిక ప్రణాళకలను అమలు చేయలేమని అన్నారు.

Updated Date - 2020-09-29T22:00:22+05:30 IST