లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే శిక్షార్హులు

ABN , First Publish Date - 2021-12-09T04:24:57+05:30 IST

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్ట రీత్యా శిక్షార్హులని వైద్యాధికారి డెమా శ్రీనివాసులు హెచ్చరించారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే శిక్షార్హులు
మాట్లాడుతున్న శ్రీనివాసులు

వైద్యాధికారి శ్రీనివాసులు

నెల్లూరు(వైద్యం) డిసెంబరు 8 : లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్ట రీత్యా శిక్షార్హులని వైద్యాధికారి డెమా శ్రీనివాసులు హెచ్చరించారు. బుధవారం వైద్య కళాశాలలో లింగ నిర్ధారణపై ప్రాఽథమిక వైద్యాధికారులకు శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏదైనా స్కానింగ్‌ సెంటర్‌ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవన్నారు. ప్రాఽథమిక ఆసుపత్రుల వైద్యాధికారులు తమ పరిధిలోని స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ఈ చట్టంపై ఆరోగ్య, ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో ధర్మేంద్ర, వైద్యాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T04:24:57+05:30 IST