పటేల్ మరింత కాలం బతికుంటే..: గోవాలో మోదీ

ABN , First Publish Date - 2021-12-20T01:56:23+05:30 IST

పోర్చుగీసు వారి ఏలుబడిలో గోవా ఉండేది. కాగా, గోవాకు 1961 డిసెంబర్ 19న పోర్చుగీసు వారి నుంచి విముక్తి లభించింది. ఇక దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1950, డిసెంబర్ 15న మరణించారు..

పటేల్ మరింత కాలం బతికుంటే..: గోవాలో మోదీ

పనాజీ: మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరింత కాలం బతికి ఉంటే గోవాకు ఇంకాస్త ముందుగానే విముక్తి కలిగేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. డిసెంబర్ 19న ‘గోవా లిబరేషన్ డే’ సందర్భంగా గోవా రాజధాని పనాజీలో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.


‘‘సర్దాద్ వల్లభాయ్ పటేల్ మరికొన్ని రోజులు బతికి ఉంటే గోవాకు విముక్తి ఇంకా ముందుగానే లభించేది. మహారాష్ట్రలోని మరఠ్వాడాతో పాటు నిజాం పాలనను తప్పించిన పలేట్‌.. గోవాకు కూడా విముక్తి కల్పించేవారు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారు గోవా విముక్తి కోసం కూడా పోరాడేవారు. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఎంతో కాలానికి కానీ గోవాకు విముక్తి లభించలేదు’’ అని మోదీ అన్నారు.


మోదీ తన రోమ్ పర్యటనను గుర్తు చేసుకుంటూ ‘‘కొద్ది రోజుల కిందట నేను ఇటలీకి వెళ్లాను. నాకు అక్కడ పోప్ ఫ్రాన్సిస్‌ను కలుసుకునే అవకాశం లభించింది. ఆయనను ఇండియాకు రావాలని కోరాను. దానికి ఆయన సమాధానమిస్తూ ‘ఇది నాకు అత్యంత పెద్ద బహుమతి’’ అని అన్నారు. ఇది ఇండియా ప్రజాస్వామ్య గొప్పతనం, ఇక్కడి భిన్నత్వంలో ఏకత్వంలోని విశిష్ట లక్షణం’’ అని మోదీ అన్నారు.


పోర్చుగీసు వారి ఏలుబడిలో గోవా ఉండేది. కాగా, గోవాకు 1961 డిసెంబర్ 19న పోర్చుగీసు వారి నుంచి విముక్తి లభించింది. ఇక దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1950, డిసెంబర్ 15న మరణించారు.

Updated Date - 2021-12-20T01:56:23+05:30 IST