పాత వాహనాన్నిస్తే... ఐదు శాతం రాయితీ...

ABN , First Publish Date - 2021-03-09T01:05:11+05:30 IST

పాత కారును విక్రయించి, కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ వెసులుబాటు కల్పించారు. పాత వాహనాలను తీసివేసి కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే... ఐదు శాతం రాయితీ లభిస్తుదన్నది దాని సారాంశం.

పాత వాహనాన్నిస్తే... ఐదు శాతం రాయితీ...

న్యూఢిల్లీ : పాత కారును విక్రయించి, కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ వెసులుబాటు కల్పించారు. పాత వాహనాలను తీసివేసి కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే... ఐదు శాతం రాయితీ లభిస్తుదన్నది దాని సారాంశం. వెహికిల్ స్క్రాపేజీ పాలసీలో ఈ నిబంధనను కేంద్రం త్వరలో చేర్చనుంది. వివరాలిలా ఉన్నాయి. 


ఈ(2021-22) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో వాలంటరీ వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత వాహనాలకు ఇరవై ఏళ్ల తర్వాత, వాణిజ్య వాహనాలకు పదిహేనేళ్ళ తర్వాత పిట్‌నెస్ టెస్ట్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. కాగా...మరో పదిహేను రోజుల్లో వెహికిల్ స్క్రాపేజీ పాలసీని కేంద్రం వెల్లడించనుంది. పాత వాహనాలు ఇచ్చి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే ఐదు శాతం రాయితీనివ్వాలని కేంద్రం ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ క్రమంలో... పాత వాహనాన్ని అప్పగించి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే ఆటోమొబైల్ సంస్థలు ధరలో ఐదు శాతం రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-03-09T01:05:11+05:30 IST