విధుల్లోకి తీసుకోకుంటే ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం

ABN , First Publish Date - 2021-07-27T06:05:32+05:30 IST

అకారణంగా 17 నెలల క్రితం తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోకుంటే ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం చేస్తామని ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘ జిల్లా అధ్యక్షుడు గడ్డం రమేష్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

విధుల్లోకి తీసుకోకుంటే ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం
మాట్లాడుతున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘ జిల్లా అధ్యక్షుడు రమేష్‌

హుజురాబాద్‌ ఉపెన్నిక బరిలో 32మంది జిల్లా నుంచి పోటీకి తీర్మానం

ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం రమేష్‌  

జగిత్యాల అర్బన్‌, జూలై 26: అకారణంగా 17 నెలల క్రితం తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోకుంటే ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం చేస్తామని ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘ జిల్లా అధ్యక్షుడు గడ్డం రమేష్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక దేవిశ్రీ గార్డెన్‌లో జిల్లాలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సోమవారం స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు గ డ్డం రమేష్‌ సర్పంచ్‌ల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు ఎన్నం కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ విధుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం పై ఒత్తిడి పెం చేందుకు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్ర కమిటీ సూచనల మేరకు హుజూరాబాద్‌ ఎన్నిక నోటిఫికేషన్‌ రాకముందే తమను విధుల్లోకి తీసుకోవాలని లేదంటే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో వె య్యిమంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఉప ఎన్నిక బరిలో నిలుపుతామన్నారు. దీనిలో భాగంగా జిల్లా నుంచి 32 మందిని పోటీ చేయించే విధంగా ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన 4779 జీవోను సవరించాలని, 2020 మార్చిలో 9 రోజులు సమ్మె చేస్తే ఉన్న ఉద్యోగాలను తొలగించారన్నారు. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగుల తో కలిసి ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్న విషయాన్ని ప్రస్తుత సీఎం కేసీఆర్‌ మర్చిపోయారని విమర్శించారు. తొలగించిన ఫీల్డ్‌ అసి స్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని లేనట్లయితే ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం చేసేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు వెనుకాడరని రమేష్‌ ప్ర భుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు మృతి చెందగా సమావేశంలో భాగంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘ ప్రతినిధులు బల్గం రాజేంధర్‌, కాసం సంతోష్‌, నసీర్‌, మహేష్‌, సత్యవాణి, సుజాత, రేవతితో పాటు జిల్లాలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:05:32+05:30 IST