అమెజాన్... విచారణను అడ్డుకుంటోంది * ఎనిమిదో తేదీ లోపు స్పందించకుంటే చర్యలు ?

ABN , First Publish Date - 2022-06-03T00:49:58+05:30 IST

అమెరికాలోని ఇల్లినాయిస్‌లో గిడ్డంగి కుప్పకూలిన ఘటనపై ప్యానెల్ దర్యాప్తును Amazon "అడ్డుకుంటోందని హౌస్ ఓవర్‌సైట్ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అమెజాన్... విచారణను అడ్డుకుంటోంది  * ఎనిమిదో తేదీ లోపు స్పందించకుంటే చర్యలు ?

ఇల్లినాయిస్ : అమెరికాలోని ఇల్లినాయిస్‌లో గిడ్డంగి కుప్పకూలిన ఘటనపై ప్యానెల్ దర్యాప్తును Amazon "అడ్డుకుంటోందని హౌస్ ఓవర్‌సైట్ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమెజాన్ CEO ఆండీ జాస్సీకి నిన్న(బుధవారం) రాసిన లేఖలో... ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. గిడ్డంగి కూలిపోవడానికి సంబంధించి చట్టసభ సభ్యులు కోరిన కీలక పత్రాలను అందించాల్సిన క్రమానికి సంబంధించి Amazon స్పందించలేదని వినవస్తోంది.


నిరుడు డిసెంబరులో... ‘DLI4’గా వ్యవహరించే అమెజాన్ గిడ్డంగులలో ఒకటి విపరీతమైన వేగంతో కూడిన సుడిగాలి ప్రభావానికి కూలిపోయింది. ఈ క్రమంలో... 1.1 మిలియన్ చదరపుటడుగుల వైశాల్యమున్న ఆ గిడ్డంగి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఏప్రిల్‌లో హౌస్ ఓవర్‌సైట్ కమిటీ... ఈ ఘటనపై విచారణను చేపట్టింది.


గిడ్డంగి కూలిపోయిన ఘటనకు సంబంధించి... విచారణకు ప్రతిస్పందించేందుకు, ఆయా పత్రాలను అందించేందుకు  చట్టసభ సభ్యులు అమెజాన్‌కు ఏప్రిల్ 14 వరకు గడువిచ్చారు. ‘ఏప్రిల్ 2022 గడువు నుండి దాదాపు ఏడు వారాలు గడిచాయి, అయినప్పటికీ అమెజాన్ ఇప్పటికీ కమిటీ సిబ్బంది గుర్తించిన పత్రాలనందించలేదు’ అని చట్టసభ సభ్యులు తెలిపారు. గిడ్డంగి కూలిపోవడంపై అంతర్గత విచారణకు సంబంధించిన పత్రాలను పంచుకోవడానికి కూడా అమెజాన్ నిరాకరించిందని చట్టసభ సభ్యులు తెలిపారు. అమెజాన్ న్యాయవాదులు ‘పని-ఉత్పత్తి, న్యాయవాది-క్లయింట్ అధికారాలు’ను పేర్కొంటూ వాటిని అందించేందుకు నిరాకరించారని తెలిపారు. అవి చెల్లుబాటయ్యే కారణాలు కావని అధికారులు పేర్కొన్నారు.


కీలక పత్రాలను అందించడంలో అమెజాన్ వైఫల్యం కమిటీ విచారణకు ఆటంకం కలిగించిందని చట్టసభ సభ్యులు ప్రభుత్వానికి సమాచారమిచ్చారు. కాగా... ఈ ప్రహసనంపై ఈ నెల(జూన్) 8 లోపు Amazon ప్రతిస్పందించాల్సి ఉంది. ఆ తర్వాత కూడా ఫలితం లేనిపక్షంలో... అమెజాన్‌పై చర్యలు తీసుకునే సూచనలున్నాయని వినవస్తోంది. 

Updated Date - 2022-06-03T00:49:58+05:30 IST