ముప్పిడిని కాదంటే.. ‘గోపాలు’డెవరు?

ABN , First Publish Date - 2022-07-02T08:45:17+05:30 IST

ముప్పిడిని కాదంటే.. ‘గోపాలు’డెవరు?

ముప్పిడిని కాదంటే.. ‘గోపాలు’డెవరు?

అధిష్ఠానం ఆశీస్సులు తనకేనంటూ మద్దిపాటి వెంకట్రాజు ప్రచారం

శ్రేణులు, నేతల్లో అయోమయం

వెంకటేశ్వరరావు తప్ప మరొకరు వద్దు!

నియోజకవర్గ సీనియర్ల స్పష్టీకరణ

లోతుగా ఆరా తీస్తున్న అధిష్ఠానం

కొద్దిరోజుల్లో తుది నిర్ణయం వచ్చే చాన్సు


(ఏలూరు-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భాగమైన గోపాలపురం (ఎస్సీ) నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. దశాబ్దాల తరబడి ఆ పార్టీకి తిరుగులేదు. పల్లెల్లో బలమైన కేడర్‌. క్రమశిక్షణతో నడిపించే నేతలెందరో! గత ఎన్నికల్లో అనూహ్యంగా భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. పార్టీ కార్యక్రమాల అమలులో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అందరినీ కలుపుకొనిపోతూ క్షేత్రస్థాయిలో పూర్తిగా నిలదొక్కుకునేలా సమష్టి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడాయనకు ఎసరు తెచ్చే యత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకట్రాజు తనకు అధిష్ఠానం ఆశీస్సులు ఉన్నాయంటూ విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. ఈ హఠాత్‌ పరిణామంతో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. వెంటనే నియోజకవర్గ సీనియర్లు రంగంలోకి దిగారు. ముప్పిడికే తిరిగి అవకాశమివ్వాలని.. వేరే ఆలోచనే వద్దని నాయకత్వానికి నివేదించారు. 


గోపాలపురం టీడీపీలో తత్తరపాటు

ఇప్పుడెందుకీ వివాదం..?

టీడీపీ ఆవిర్భావం నుంచి దాదాపు ఏడు సార్లు గోపాలపురం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలే గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌, 19లో వైసీపీ విజయం సాధించా యి. ఇక్కడ టీడీపీకి పటిష్ఠ కేడర్‌ ఉంది. నేతలు కూడా సమష్టి వ్యూహాలతో నడుస్తుంటారు. అడ్వకేట్‌, పార్టీ విధేయుడిగా ఉన్న ముప్పిడి వెంకటేశ్వరరావును 2014 లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించి గెలిపించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు.. ద్వారకాతిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం పరిధుల్లో పార్టీ శ్రేణులు ఉమ్మడిగా కలిసి పనిచేశాయి. 2019లో ఆయన ఓడిపోయినా.. నియోజకవర్గ  శ్రేణుల్లో అత్యధికులు ఆయ న అభ్యర్థిత్వం వైపే మొగ్గుచూపుతున్నారు. నేత లు, కార్యకర్తలందరినీ కలుపుకొని వెళ్లడమే దీనికి కారణం. పైగా పార్టీ కార్యక్రమాలు ఇక్కడ నిరంతరం కొనసాగిస్తుంటారు. అ యితే ఈ దఫా ఎలాగైనా బరిలోకి దిగాల ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకట్రాజు తహతహలాడుతున్నారు. గడిచిన ఎన్నికల్లోనూ తానే అభ్యర్థినని విస్తృతంగా ప్రచారం చేసుకున్నా కుదరలేదు. ఈ మధ్య కాలంలో తన ప్రచారాన్ని ఉధృతం చేశా రు. పార్టీ అధిష్ఠానం ఆశీస్సులు తనకు సంపూర్ణంగా ఉన్నాయని అంటున్నారు. ఇది కేడర్‌లో ఆందోళన రేపింది. 2దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి ఉండగా.. వేరెవరికో ఇవ్వాల్సిన పనిలేదని నియోజకవర్గాల సీనియర్లు, వివిధ అనుబంధ సంస్థలు, శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. తానే అభ్యర్థినని ప్రచా రం చేసుకుంటున్న వెంకట్రాజుకు ఉన్న అర్హతలేమిటో గుర్తించాలని అధిష్ఠానాని కి సూచిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉ న్న తరుణంలో ముప్పిడి మాదిరిగా ఆ య న ఏం కార్యక్రమాలు చేశారని ప్రశ్నిస్తున్నా రు. ఈ వ్యవహారంలో ఇటీవల నాయకత్వం ఓ సమావేశం నిర్వహించింది. ఆ సమయంలో ఉభయపక్షాలూ తమ తమ వాదనలు వినిపించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై నాయకత్వం పూర్తి స్థాయిలో దృ ష్టి సారించింది. నియోజకవర్గం నుంచి సమగ్ర సమాచారం రాబడుతోంది. అచ్చెన్నాయుడు, ఇతర సీనియర్లు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నేతల నుంచి వివరాలు తెప్పించుకుని.. అధినేత చంద్రబాబుకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ అంశంలో అధిష్ఠానం తుది నిర్ణయం ప్రకటించే అవకాశముందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2022-07-02T08:45:17+05:30 IST