ఏడవని మగాళ్లు ఏకాకులే!!

ABN , First Publish Date - 2020-03-12T17:23:29+05:30 IST

మగాళ్లు ఏడవకూడదు!! ఎప్పుడూ గంభీరంగా కనిపించాలి.. భావోద్వేగాలను వ్యక్తం చేయకూడదు!! వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు!! ఇలాంటి స్వీయ ఆంక్షల

ఏడవని మగాళ్లు ఏకాకులే!!

వాషింగ్టన్‌, మార్చి 11 : మగాళ్లు ఏడవకూడదు!! ఎప్పుడూ గంభీరంగా కనిపించాలి.. భావోద్వేగాలను వ్యక్తం చేయకూడదు!! వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు!! ఇలాంటి స్వీయ ఆంక్షల చట్రంలో జీవించే పురుషులు వాళ్లకు వాళ్లే కీడు చేసుకుంటున్నారని అమెరికాలోని మిచిగాన్‌ స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు  తెలిపారు. ఇతరులతో సాదకబాధకాలను పంచుకోని.. సంతోషం, బాధ కలిగిన సందర్భాల్లో భావోద్వేగాలను వ్యక్తపరచని పురుషులు చివరకు ఏకాకులుగా మిగిలిపోతారని 5500 మందిపై జరిపిన అధ్యయనంలో గుర్తించారు. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తలెత్తిన సందర్భాల్లో ఇతరులకు వాటిని చెప్పకుండా తమలో తామే కుమిలిపోయే ‘మగా’నుభావులు మానసిక సమస్యల బారినపడే అవకాశాలు ఎక్కువన్నారు.

Updated Date - 2020-03-12T17:23:29+05:30 IST