వాన పడితే నారుమడే..!

ABN , First Publish Date - 2022-08-11T03:24:10+05:30 IST

పుల్లలచెరువు మండలంలో ప్రధాన రోడ్లు, అంతర్గత రహదారులు అధ్వా నంగా మారాయి.

వాన పడితే నారుమడే..!
పుల్లలచెరువు - ఎర్రగొండపాలెం రోడ్డు గుంతల్లో నిండిన నీరు

ఏళ్లుగా లేని మరమ్మతులు 

పుల్లలచెరువు - వైపాలెం 

ఆర్‌అండ్‌బీ రోడ్డు  అధ్వానం

రాకపోకలు నరకమంటున్న ప్రజలు

పుల్లలచెరువు, ఆగస్టు 10 : పుల్లలచెరువు మండలంలో ప్రధాన రోడ్లు, అంతర్గత రహదారులు అధ్వా నంగా మారాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న చిరు జల్లులకు మండలంలోని రోడ్డులు బురదమయం కావడంతో ప్రయాణికులు రాకపోకలు సాగిం చేందుకు ఇబ్బంది పడతున్నారు. పుల్లలచెరువు- ఎర్ర గొండపాలెం ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డులో వర్షానికి గుం తల్లోకి నీరు చేరి నారు మడిని తలపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఎ క్కడ ఆ గోతుల్లో బళ్లు ఇరుక్కుపోతాయోనని వాహన చోద కులు ఆందోళన చెందుతున్నారు. పదేళ్లుగా శాశ్వత రోడ్డు ఏర్పాటు చేస్తామన్న ప్రజాప్రతినిధులు హామీలు నీటి మూటలయ్యాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు పుల్లలచెరువు - వైపాలెం ప్రధా న రోడ్డు కావడంతో నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. వైసీపీ అధికారంలో వచ్చాక డబుల్‌ రోడ్డు నిర్మిస్తామని చెప్పినా నేటికీ పురోగతి లేదు.  అప్పుడప్పుడు రెండు కిలోమీటర్ల మేర మరమ్మతులు చేసి చేతులుదులుపుకుంటున్నారు. దీంతో ఈ రోడ్డున వెళ్లే అధికారులు, ప్రజలు నరకం చేస్తున్నారు.  చాపలమడుగు - సి.కొత్తపల్లి, రంగనపాలెం - కుందంపల్లి, మానేపల్లి - రెంటపల్లి, పుల్లలచెరువు - గంగవరం, పుల్లలచెరువు - గారపెంట రోడ్డులు పెద్ద పెద్ద గుంతలతో ఉన్నాయి. ఈ రోడ్ల గుండా ప్రయాణం చేసేందుకు ప్రజలు భయపడుతున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు లేక బురదగా మారాయి. ఇప్పటికైనా సం బంధిత అధికారులు వెంటనే రోడ్డు నిర్మా ణానికి చర్య లు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2022-08-11T03:24:10+05:30 IST