నేనే కనుక అజిత్ పవర్‌ను పంపి ఉంటే..: 2019 ట్రాజెడీపై శరద్ పవార్

ABN , First Publish Date - 2021-12-30T22:24:55+05:30 IST

ఇదే విషయంపై శరద్ పవార్ తాజాగా స్పష్టతనిచ్చారు. తానే కనుక అజిత్ పవార్ పంపి ఉంటే ఫడ్నవీస్ ప్రభుత్వం ఇప్పటికీ అధికారంలో ఉండేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పూణెలో లోక్‌సత్తా అనే మరాఠీ పత్రిక నిర్వహించిన ఓ కార్యక్రమంలో..

నేనే కనుక అజిత్ పవర్‌ను పంపి ఉంటే..: 2019 ట్రాజెడీపై శరద్ పవార్

ముంబై: 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కొనసాగిన రాజకీయ డ్రామా గుర్తుండే ఉంటుంది. అజిత్ పవర్‌ తన పార్టీకి (ఎన్సీపీ) చెందిన కొంత మంది ఎమ్మెల్యేలతో దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అజిత్ పవార్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఫడ్నవీస్ ప్రభుత్వం కూలిపోయింది. దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటనకు ‘స్ర్కిప్ట్ రైటర్’ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అని బహిరంగంగానే అనేక వ్యాఖ్యానాలు వినిపించాయి.


ఇదే విషయంపై శరద్ పవార్ తాజాగా స్పష్టతనిచ్చారు. తానే కనుక అజిత్ పవార్ పంపి ఉంటే ఫడ్నవీస్ ప్రభుత్వం ఇప్పటికీ అధికారంలో ఉండేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పూణెలో లోక్‌సత్తా అనే మరాఠీ పత్రిక నిర్వహించిన ఓ కార్యక్రమంలో పవార్ మాట్లాడుతూ ‘‘ఒకవేళ నేను అతడిని (అజిత్ పవార్) పంపినట్లైతే ప్రభుత్వం నిలకడగా ఉండేది. అప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం ఇప్పటికీ అధికారంలో కొనసాగేది’’ అని అన్నారు.


బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై మరోసారి ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం కోరారట. కానీ అది జరగదని మోదీకి తేల్చి చెప్పినట్లు పవార్ చెప్పుకొచ్చారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన పాత్ర ఎలా ఉంటుందని పవార్‌ను ప్రశ్నించగా.. ‘‘ప్రభుత్వాధినేతకు మద్దతుగా ఉంటాను, ఆ వ్యక్తికి గైడర్‌గా వ్యవహరిస్తాను’’ అని అన్నారు.

Updated Date - 2021-12-30T22:24:55+05:30 IST