నాకు ఓపిక ఉంటే 24 గంటల్లో వంద మంది మావోలను తయారు చేసేవాడిని: గోనె ప్రకాశ్‌రావు

ABN , First Publish Date - 2022-10-03T22:45:59+05:30 IST

నాకు ఓపిక ఉంటే నేరుగా మావోయిస్టు (Maoist) ఉద్యమంలోకి వెళ్లి 24 గంటల్లో వంద మంది మావోలను తయారు చేసే వాడిని

నాకు ఓపిక ఉంటే 24 గంటల్లో వంద మంది మావోలను తయారు చేసేవాడిని: గోనె ప్రకాశ్‌రావు

కరీంనగర్: ‘నాకు ఓపిక ఉంటే నేరుగా మావోయిస్టు (Maoist) ఉద్యమంలోకి వెళ్లి 24 గంటల్లో వంద మంది మావోలను తయారు చేసే వాడిని’ అని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు ప్రకటించిన కలలకం రేపారు. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకని అనేక అవినీతి అక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు తెర లేపుతున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లాలోని కోల్డ్ బెల్ట్ ఏరియాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడ్డులేకుండా పోయిందని విమర్శించారు. దీన్ని మావోయిస్టులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు మావోయిస్టుల ఎజెండానే మా ఎజెండా అన్న.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆ మాటే వినపడకుండా చేశారని తప్పుబట్టారు.  అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన చరిత్ర మావోయిస్టులకుందని గుర్తుచేశారు. మావోయిస్టుల కదలికలు తనకు తెలుసు తెలంగాణలో వాళ్లు ఆక్టివ్ అవతున్నారని తెలిపారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న అక్రమాలపై ఆధారాలతో సహా కేసీఆర్, కేటీఆర్‌కు వివరించే ప్రయత్నం చేసిన పలితం లేదని గోనె ప్రకాశ్‌రావు విమర్శించారు. దేశవ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీపై నిషేధం విధించారు. అలాంటిది మావోయిస్టులతో ఎలాంటి సంబందం లేని ప్రకాశ్‌రావు వ్యాఖ్యలు.. ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 


సింగరేణి (Singareni) కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మావోయిస్ట్ పార్టీ మద్దతు ప్రకటించింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆ పార్టీ కోల్‌బెల్ట్‌ కమిటీ కార్యదర్శి ప్రభాత్‌ డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్‌లో విప్లవ కార్మిక సంఘాలు పట్టుకోల్పోతున్నాయి. మావోయిస్టు పార్టీ, న్యూడెమోక్రసీ, జనశక్తి సంస్థలకు అనుబంధంగా సింగరేణిలో సికాస, ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, సింగరేణి గని కార్మిక సంఘాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2000 సంవత్సరం వరకు సింగరేణిలో తిరుగులేని శక్తిగా, కార్మిక వర్గంలో పట్టుకలిగిన సింగరేణి కార్మిక సమాఖ్య నాయకత్వం ఎన్‌కౌంటర్లు, అరెస్ట్‌లతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. 

Updated Date - 2022-10-03T22:45:59+05:30 IST