‘నేను అనుమానాస్పద రీతిలో చనిపోతే..’

ABN , First Publish Date - 2022-05-10T08:40:21+05:30 IST

తనకు రష్యా నుంచి ప్రాణహాని ఉందని ప్రపంచంలోనే ధనవంతుడు, టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల సీఈవో ఎలాన్‌ మస్క్‌ పరోక్షంగా ప్రకటించారు.

‘నేను అనుమానాస్పద రీతిలో చనిపోతే..’

రష్యా నుంచి ప్రాణహాని ఉందన్న ఎలాన్‌ మస్క్‌

న్యూయార్క్‌, మే 9: తనకు రష్యా నుంచి ప్రాణహాని ఉందని ప్రపంచంలోనే ధనవంతుడు, టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల సీఈవో ఎలాన్‌ మస్క్‌ పరోక్షంగా ప్రకటించారు. ‘ఒక వేళ నేను అనుమానాస్పద రీతిలో మరణిస్తే.. ఆ విషయం చాలా బాగుంటుంది‘ అంటూ మస్క్‌ తొలుత ఓ ట్వీట్‌ చేశారు. కాసేపటికే రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్‌ డైరెక్టర్‌ జనరల్‌ దిమిత్రీ ఒలిగోవిచ్‌ రోగోజిన్‌ చేసిన ప్రకటనగా పేర్కొంటూ మస్క్‌ ఓ చిత్రాన్ని ట్వీట్‌ చేశారు. తన స్టార్‌లింక్‌ ఉపగ్రహం ద్వారా నాజీ ఉగ్రవాదులకు, ఉక్రెయిన్‌ సైన్యానికి ఎలాన్‌ మస్క్‌ సాయపడుతున్నారని, దీనికి మస్క్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని దాని సారాంశం. దీంతో రష్యా నుంచి తనకు ప్రాణ హాని ఉందనే విషయాన్ని మస్క్‌ ప్రపంచానికి చెప్పారు.

Read more