గృహాలు నిర్మించుకోకపోతే పట్టాలు వెనక్కి తీసుకుంటామన్నారు

ABN , First Publish Date - 2022-05-25T05:02:35+05:30 IST

జగన న్న కాలనీల్లో గృహాలు మం జూరైన వారు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోకపోతే పట్టాలు వెనక్కి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారని వాసవీనగర్‌ వాసులు ఆ దిలక్ష్మమ్మ, లక్ష్మీదేవి ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా ఎదుట సమస్యను తెలియజేశారు.

గృహాలు నిర్మించుకోకపోతే  పట్టాలు వెనక్కి తీసుకుంటామన్నారు
సమస్యను వివరిస్తున్న మహిళలు

పోరుమామిళ్ల, మే 24: జగన న్న కాలనీల్లో గృహాలు మం జూరైన వారు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోకపోతే పట్టాలు వెనక్కి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారని వాసవీనగర్‌ వాసులు ఆ దిలక్ష్మమ్మ, లక్ష్మీదేవి ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా ఎదుట సమస్యను తెలియజేశారు. వాసవీ నగర్‌ మిగిలిన ప్రాంతాల్లో గడప గడపకూ మన ప్రభు త్వంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దీంతో  ఆదిలక్ష్మ మ్మ, లక్ష్మీదేవి మాట్లాడుతూ మొదట ప్రభుత్వమే పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పి, ఇప్పుడు త్వరగా నిర్మాణాలు పూర్తి చేయకుంటే పట్టాలు వెనక్కి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారని సమస్యను వెలిబుచ్చారు.

పిల్లలెవరూ లేకున్నా చాపాటి వీరాస్వామికి ఏడాదికి రూ.25 వేల వంతున విద్యాదీవెన పడినట్లు వీరాస్వామి కుమారుడు సచివాలయ ఉద్యోగికి తెలియజేశారు. వెంటనే ఆ ఉద్యోగి తన దగ్గర ఉన్న వివరాలు సరిచూసుకుని డేటా చెక్‌ చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సీఎం బాషా, రంగసముద్రం సర్పంచ్‌ చిత్తారవిప్రకా్‌షరెడ్డి, తహసీల్దార్‌ విజయకుమారి, ఎంపీడీఓ నూర్జహాన్‌, ఈఓపీఆర్‌డీ రమణారెడ్డి, ఈఓలు రామ్మోహన్‌రెడ్డి, సచివాలయ అధికారులు చెన్నకేశవరెడ్డి, పీఆర్‌ఏఈ సుబ్రహ్మణ్యం, మాజీ మండలాధ్యక్షురాలు ఈశ్వరమ్మ, పోరుమామిళ్ల ఉప సర్పంచ్‌ రాళ్లపల్లి రవికుమార్‌, మాజీ ఉప సర్పంచ్‌ నరసింహులు, దనిశెట్టి ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:02:35+05:30 IST