రాజీనామా చేస్తే మళ్లీ గెలిపిస్తాం

ABN , First Publish Date - 2021-01-24T05:02:08+05:30 IST

గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానన్న నిజామాబాద్‌ ఎంపీ ధర్మ పురి అర్వింద్‌ కనీసం మద్దతు ధర అయినా ఇప్పిం చాలని.. లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేసి రైతు ఉద్యమంలో పాల్గొనాలని.. పైసా ఖర్చులేకుం డా తిరిగి గెలిపిస్తామని పసుపు రైతుల ఐక్యవేదిక నే తలు స్పష్టం చేశారు.

రాజీనామా చేస్తే మళ్లీ గెలిపిస్తాం
మాట్లాడుతున్న పసుపు రైతుల ఐక్యవేదిక ప్రతినిధులు

సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమంలో పాల్గొనాలి

ఎంపీ అర్వింద్‌కు పసుపు రైతుల ఐక్యవేదిక డిమాండ్‌

కమ్మర్‌పల్లి, జనవరి 23: గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానన్న నిజామాబాద్‌ ఎంపీ ధర్మ పురి అర్వింద్‌ కనీసం మద్దతు ధర అయినా ఇప్పిం చాలని.. లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేసి రైతు ఉద్యమంలో పాల్గొనాలని.. పైసా ఖర్చులేకుం డా తిరిగి గెలిపిస్తామని పసుపు రైతుల ఐక్యవేదిక నే తలు స్పష్టం చేశారు. శనివారం ఎంపీ అర్వింద్‌తో ముఖాముఖిలో పాల్గొన్న అనంతరం వారు విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. ఎంపీతో చర్చవేదిక సంతృప్తికరంగా లేదని, ఆయన పసుపు బోర్డు, మద్ద తు ధరల విషయంలో దాటవేసే ధోరణి అవలంబించా రని ఆరోపించారు. రాజీనామా చేసి వస్తే గతంలో తెల ంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను గెలిపించినట్లే అతన్ని కూడా కడుపులో పెట్టుకుని గెలిపించుకుంటామ న్నారు. పసుసు బోర్డు, మద్దతు ధరల విషయంలో పార్టీ లకు అతీంగ ఇచ్చిన హామీలు నెవేర్చాలని, లేని పక్షంలో  ప్రతీ నాయకుడిని తాము టారెట్గ్‌ చేస్తూ నిలదీస్తామన్నా రు. ఇప్పటికైనా మద్దతు ధర రూ.15 వేలు కాకపోయినా.. కనీసం రూ.10 వేలైనా ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఎంపీతో చర్చవేదిక ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోవడంతో మరో రెండు రోజుల్లో భవ్యిత్‌ కార్యాచరణ రూపొందిస్తామని, అవసర మైతే ఆమరణ నిరాహారదీక్షకైనా పూనుకుంటామన్నారు. ఈ స మావేశంలో రైతుప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డి, సుకెట్‌ రవి, పడి గెల ప్రవీణ్‌, ఏలేటి మోహన్‌ రెడ్డి, కుంట ప్రతాప్‌ రెడ్డి, గోపిడి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రూ.10 వేల మద్దతు ధర ఇప్పించాలని ఎంపీకి రైతు పాదాభివందనం 

పసుపు పంట పండించే రైతు తీవ్రనష్టాల్లో పడిపోతున్నాడ ని.. దయచేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ పసుపు నకు క్వింటాలుకు రూ.10 వేల మద్దతుధర ఇప్పించాలని  వే ల్పూర్‌ మండలంలోని కేసీఆర్‌ దత్తత గ్రామం మోతె గ్రామాని కి చెందిన యువరైతు కానూరి సవజీవ్‌ ఎంపీకి పాదాభివంద నం చేశారు. అతడు పసుపు పండించి నష్టపోయిన తీరును ఎంపీకి రైతుల సమక్షంలో వినిపించాడు.



Updated Date - 2021-01-24T05:02:08+05:30 IST