తండ్రి కోసం వస్తే తననే కావాలన్నాడు!

ABN , First Publish Date - 2022-08-09T07:23:08+05:30 IST

తండ్రి కోసం వస్తే తననే కావాలన్నాడు!

తండ్రి కోసం వస్తే తననే కావాలన్నాడు!

సదరం సర్టిఫికెట్‌ కావాలంటే శారీరకంగా సహకరించాలన్న డాక్టర్‌

ఎన్టీఆర్‌ జిల్లా మహిళకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేదు అనుభవం

ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

ఖమ్మం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఎంతోమంది దివ్యాంగులకు ప్రోత్సాహం అందించేందుకు సర్టిఫికెట్లు మంజూ రు చేసి తద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిని చేకూర్చేందుకు సదరం శిబిరాలను ఏర్పాటు చే స్తూ ఉంటారు. కానీ ఖమ్మానికి చెందిన ఓ వైద్యుడు మా త్రం ఆ శిబిరాన్ని తన సరసాలకు కేరా్‌ఫగా ఎంచుకున్నా డు. దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే మహిళలను శారీరకంగా లొంగదీసుకునేందుకు సదరం సర్టిఫికెట్‌ను అస్త్రంగా వాడుకున్నాడు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరానికి తన తండ్రికి సహాయంగా ఉండేందుకు వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు.. శారీరకంగా సహకరించాలని ఒత్తిడి చేయడంతో సదరు మహిళ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాకు చెందిన తన తండ్రి సదరం సర్టిఫికెట్‌ నిమిత్తం ఎన్టీఆర్‌ జిల్లాలోని ఓ మహిళా మండలికి చెందిన ఓ మహిళ గత నెల 7న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఓపీ రాయించుకున్న అనంతరం రూం నెంబర్‌ 8లో ఉన్న డాక్టర్‌ని కలవాలని చెప్పడంతో అక్కడకు వెళ్లగా.. సదరు డాక్టర్‌ సదరు ఆ మహిళ ఫోన నెంబరు తీసుకుని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. పలుమార్లు ఫోన్లు చేసి సదరం సర్టిఫికెట్‌ కావాలంటే తనకు శారీరకంగా సహకరించాలని, పర్మినెంట్‌గా ఉంటే నెలకు రూ.20వేలు చెల్లిస్తానని అనడంతోపాటు.. రాత్రి 12గంటల సమయంలో వీడియోకాల్‌ చేసి శరీర భాగాలు చూపించాలని వేధించసాగాడు. ఇదే క్రమంలో ఆమెను ఒంటరిగా రావాలని హుకుం జారీచేయడంతో ఈ నెల 17న ఆమె ఖమ్మం వచ్చింది. ఈక్రమంలో ఆమెనగరంలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్‌కు రావాలని సూచించగా.. సదరు మహిళ తన బంధువుని తీసుకుని వెళ్లడంతో వైద్యుడు అక్కడకు రా కుండా జారుకున్నాడు. దీనికి సంబంధించి సదరు మహి ళ వైద్యుడిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయగా.. విషయాన్ని అధికారులు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ నెల 4న ఆమె ఫిర్యాదు చేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే నాలుగో తేదీన సదరు మహిళ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ఆ వైద్యుడు ఆదివారం సదరు మహిళ తనని బ్లాక్‌ మెయిల్‌ చేస్తోందంటూ ఫిర్యాదు చేయడం గమనార్హం. దీనిపై బాధిత మహిళ సోమవా రం ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణకోరగా ఈ విషయం పై తమకు ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవేమనని, విచారణ జరిపిచర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. 

Updated Date - 2022-08-09T07:23:08+05:30 IST