హాని కలిగిస్తే భారత్ ఎవరినీ వదిలిపెట్టదు: రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2022-04-16T01:55:31+05:30 IST

వాషింగ్టన్ : డ్రాగన్ దేశం చైనాకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌కు హాని తలపెడితే ఎవరినీ వదిలిపెట్టబోదని వార్నింగ్ ఇచ్చారు.

హాని కలిగిస్తే భారత్ ఎవరినీ వదిలిపెట్టదు: రాజ్‌నాథ్ సింగ్

వాషింగ్టన్ : డ్రాగన్ దేశం చైనాకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌కు హాని తలపెడితే ఎవరినీ వదిలిపెట్టబోదని వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దులో సైనికుల పరాక్రమం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పగలను. హాని కలిగిస్తే భారత్ ఎవరినీ వదిలిపెట్టబోదనే గట్టి సందేశం చైనాకు అందిందని రాజ్‌నాథ్ అన్నారు. లఢాక్ సరిహద్దులో భారత్ - చైనా బలగాల ప్రతిష్ఠంభనను ఆయన గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించిందని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రపంచంలో టాప్ - 3 ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా భారత్ అడుగులు వేస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు.


 అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇండియన్- అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒకరికి లాభదాయకం.. మరొకరికి నష్టదాయకమైన దౌత్యవిధానాన్ని భారత్ విశ్వసించబోదని అగ్రరాజ్యం అమెరికాకు సున్నిత హెచ్చరిక చేశారు. ఒక దేశంతో స్నేహపూర్వక సంబంధాలు మరో దేశాన్ని నష్టపరచకూడదని అన్నారు. కాగా మంత్రుల స్థాయిలో 2 ప్లస్ 2 దౌత్యచర్చల్లో పాల్గొనేందుకు ఆయన అమెరికా వెళ్లారు. 

Updated Date - 2022-04-16T01:55:31+05:30 IST