జీఎస్టీ పరిధిలోకి తెస్తే పెట్రోల్‌ ధర రూ.75కు తగ్గుతుంది!

ABN , First Publish Date - 2021-03-05T07:41:57+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ను వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తెస్తే వీటి ధరలు బాగా తగ్గుతాయని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తాజాగా పేర్కొన్నారు. జీఎస్టీ కిందకు తెస్తే దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్‌ ధర రూ.75కు, డీజిల్‌ ధర 68కి తగ్గుతుందని

జీఎస్టీ పరిధిలోకి తెస్తే  పెట్రోల్‌ ధర రూ.75కు తగ్గుతుంది!

ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనా


ముంబై, మార్చి 4: పెట్రోల్‌, డీజిల్‌ను వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తెస్తే వీటి ధరలు బాగా తగ్గుతాయని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తాజాగా పేర్కొన్నారు. జీఎస్టీ కిందకు తెస్తే దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్‌ ధర రూ.75కు, డీజిల్‌ ధర 68కి తగ్గుతుందని గురువారం చెప్పారు. కానీ ఈ దిశగా రాజకీయ సంకల్పం కొరవడిందని, ఫలితంగా ఇంధన ధరలు దేశంలో భగ్గుమంటున్నాయన్నారు. జీఎస్టీ పరిధిలోకి తేవడం వల్ల కేంద్రం, రాష్ట్రాలకు ఆదాయ నష్టం కేవలం రూ.లక్ష కోట్లు లేదా జీడీపీలో 0.4ు ఉంటుందని అంచనా వేశారు. ముడిచమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం కేంద్రం, రాష్ట్రాలకు ఇష్టం లేదని, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల రూపంలో వాటికి ప్రధానంగా ఆదాయం సమకూరుతుండటమే ఇందుకు కారణమన్నారు. కాగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడిచమురు ధర 60 డాలర్లు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ రూ.73 లెక్కన ఆర్థికవేత్తలు ఇంధన ధరలకు సంబంధించిన లెక్కలుగట్టారు. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో చమురు ధరల్లో సుస్థిరత్వానికి సంబంధించి ఇచ్చిన హామీని చమురు ఉత్పత్తిని చేపడుతున్న ఒపెక్‌ ప్లస్‌ దేశాలు నిలబెట్టుకోవాలని భారత్‌ కోరింది.  

Updated Date - 2021-03-05T07:41:57+05:30 IST