Feb 22 2020 @ 01:42AM

కరెంట్‌ పోతే.. మర్డరే..!

‘డాన్‌ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్‌’. 


తెలుగు రాష్ర్టాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ కథానాయిక. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు. సరస్వతి ఫిల్మ్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఒంగోలులో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్‌ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే’ అన్న డైలాగ్‌తో సాగే టీజర్‌ను శివరాత్రి సందర్భంగా శుక్రవారం రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘టీజర్‌లో రవితేజ మాస్‌ పెర్ఫార్మెన్‌కు, ఆయన శైలి డైలాగ్‌లకు స్పందన బావుంది. రవితేజ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉంటాయి. తమన్‌ నేపథ్య సంగీతం అదిరిపోయేలా ఇచ్చాడు. మే 8న సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి. మధు, కో ప్రొడ్యూసర్‌ అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.