కొవిడ్‌ ఇబ్బందులుంటే కాల్‌ 104

ABN , First Publish Date - 2021-04-16T05:30:00+05:30 IST

కొవిడ్‌ ఇబ్బందులుంటే 104కు కాల్‌ చేయాలని కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ అన్నారు.

కొవిడ్‌ ఇబ్బందులుంటే కాల్‌ 104
సమావేశానికి హాజరైన అధికారులు, ఇన్‌సెట్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

  1. కాంటాక్టు ట్రేసింగ్‌, టెస్టింగ్‌ను పకడ్బందీగా చేపట్టండి
  2. కొవిడ్‌పై చర్యలు, వ్యాక్సినేషన్‌లపై కలెక్టర్‌ సమీక్ష

కర్నూలు(ఆంధ్రజ్యోతి/కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 16: కొవిడ్‌ ఇబ్బందులుంటే 104కు కాల్‌ చేయాలని కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో కొవిడ్‌ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌పై కొవిడ్‌ జిల్లా నోడల్‌ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సాయంత్రం విలేకరులతోనూ ఎస్పీ ఫక్కీరప్పతో కలిసి మాట్లాడారు. కరోనా మందులు, ఆహారం సరఫరా, శానిటైజేషన్‌.. ఎలాంటి ఇబ్బంది ఉన్నా బాధితులు 104కు కాల్‌ చేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించామని అన్నారు. కరోనా మహ మ్మారిని ఎదుర్కోడానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ చాలా వేగంగా వ్యాపిస్తున్నదన్నారు. లాక్‌డౌన్‌ లేకుండానే కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలన్నారు. మండలం, వార్డు, సచివాలయం, గ్రామం, వీధుల వారీగా పాజిటివ్‌ కేసుల నమోదు పరిశీలించాలన్నారు. కాంటాక్టు ట్రేసింగ్‌, టెస్టింగ్‌ను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి మెడికల్‌ కిట్లు ఇవ్వాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, మెడికల్‌ ఆఫీసర్లు విజిట్‌ చేసి.. బాధితుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు.హోం ఐసొలేషన్‌లో వసతులు లేకుంటే వారిని కొవిడ్‌ కేర్‌ హాస్పిటల్‌కు తరలించాలన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని టిడ్కో హౌస్‌లను కొవిడ్‌ కేర్‌ హాస్పిటళ్లుగా మార్చి సదుపాయాల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కాల్‌ సెంటర్లకు వచ్చే కొవిడ్‌ ఫిర్యాదులకు స్పందించి మూడు గంటల్లోపు టెస్టింగ్‌ పూర్తి చేయాలన్నారు. ఆఫీసుల్లో మాస్కు ధరించాలన్నారు. జేసీ రాంసుందర్‌ రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ గౌతమిసాలి, నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, డిస్ర్టిక్ట్‌ కొవిడ్‌ కో ఆర్డినేషన్‌ ఆఫీసర్‌, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో డా. రామగిడ్డయ్య, జిల్లా అధికారులు, కొవిడ్‌ నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-16T05:30:00+05:30 IST