పిల్లలకు పాల దంతాలొస్తుంటే...

ABN , First Publish Date - 2021-12-21T05:30:00+05:30 IST

పాల దంతాలొచ్చే క్రమంలో పిల్లలు చేతికి అందిన ప్రతి వస్తువునూ

పిల్లలకు పాల దంతాలొస్తుంటే...

పాల దంతాలొచ్చే క్రమంలో పిల్లలు చేతికి అందిన ప్రతి వస్తువునూ నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు టీతర్లు ఉపయోగపడతాయి. అయితే వాటిని ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 


టీతర్లతో పిల్లలకు చక్కని కాలక్షేపం. అయితే వాటిని కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. 


 టీతర్ల తయారీలో లోహం వాడి ఉండకూడదు.

 నాన్‌ టాక్సిక్‌ టీతర్లనే ఎంచుకోవాలి. 

 అవి పిల్లల గొంతులో ఇరుక్కుపోయేటంత చిన్నవై ఉండకూడదు. 

 పిల్లలు కొరకడానికి వీలుగా ఉండాలి. 

 ఒకటి కంటే ఎక్కువ టీతర్లు కొని పెట్టుకోవాలి. 

 టీతర్లలో నీళ్లు నిండినవి, జెల్‌ నింపినవి కూడా ఉంటాయి. అయితే వాటిని కొనేటప్పుడు ఎక్కడా లీకు లేకుండా చూసుకోవాలి. 

 టీతర్లు తేలికగా రంధ్రాలు పడేవి కాకుండా ఉండాలి. 

 ప్లాస్టిక్‌ టీతర్లు కిందపడితే విరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి కొనకపోవడమే మేలు. 

 సిలికాన్‌తో తయారైన టీతర్లు సురక్షితమైనవి.


Updated Date - 2021-12-21T05:30:00+05:30 IST