మర్లబడితే.. మటాష్‌

ABN , First Publish Date - 2021-07-27T04:22:55+05:30 IST

దశాబ్దాలుగా ఉభయ తెలుగు రాష్ర్టాల ప్ర జలు కృష్ణానదిపై నిత్యం ప్రమాదపు అంచున ప్రయాణం చేస్తున్నారు.

మర్లబడితే.. మటాష్‌
మరబోటులో సోమశిల నుంచి రాయలసీమకు వెళ్తున్న ప్రజలు

- కృష్ణానదిపై ప్రమాదకరంగా మరబోటు ప్రయాణం

- నిత్యం రాకపోకలు సాగిస్తున్న తెలంగాణ, రాయలసీమ ప్రజానీకం

- పట్టాలెక్కని సోమశిల-సిద్దేశ్వరం వెంతన నిర్మాణం

- ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ ఉగ్రరూపం

- నదీ ప్రయాణంపై ఆంక్షలు విధించని అధికార యంత్రాంగం


కొల్లాపూర్‌, జూలై 26 : దశాబ్దాలుగా ఉభయ తెలుగు రాష్ర్టాల ప్ర జలు కృష్ణానదిపై నిత్యం ప్రమాదపు అంచున ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ, రాయలసీమ సరిహద్దుల్లో చుట్టూ నల్లమల కొండల నడుమ ప్రవహించే కృష్ణానది మీదుగా ప్రతీ నిత్యం మరబోటులలో ప్రయాణం చేస్తూ, హైరిస్క్‌ చేస్తున్నారు. ఇక్కడ సోమశిల-సిద్దేశ్వరం వంతెనను నిర్మించాలనే డిమాండ్‌ ఏళ్లుగా ఉన్నా, ఇప్పటికీ బీజం ప డటం లేదు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రతిపాదనలు సి ద్ధం చేయడం, నిధులు మంజూరు చేయడం, సర్వే పనులు ప్రారం భించడం, టెండర్ల ప్రక్రియ వరకే పరిమితం అవుతోంది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల గ్రామం వద్ద కృష్ణానది రెండు కొండల మధ్య ప్రవహిస్తుంది. అవతలి ఒ డ్డున ఏపీలోని రాయలసీకు చెందిన గ్రామాలు, ఇవతలి ఒడ్డున తెలంగాణలోని కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని గ్రామాలు ఉన్నా యి. ఈ నియోజకవర్గ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారితో బంధుత్వం అధికంగా ఉండటంతో, అవతలి ఒడ్డున ఉన్న రాయలసీమ ప్రజలు నిత్యవసర సరుకులు, కూ రగాయలకు కొల్లాపూర్‌కు వస్తుంటారు. తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా తమ బంధువులను కలిసేందుకు అక్కడి ఆ త్మకూర్‌, నందికొట్కూర్‌ ప్రాంతాలకు వెళ్లేందుకు మరబోటులపై ఆధారప డి కృష్ణానదిపై ప్రయాణం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంత వాసులు సి ద్దేశ్వరం, సంగమేశ్వరం, కపిలేశ్వరం, మాడ్గుల, ఎర్రమట్టం, బుట్టలిమడు గు, శివపురం, ఆత్మకూర్‌ మరబోటుపై కృష్ణానది మీదుగా సోమశిల గ్రా మానికి చేరుకొని కొల్లాపూర్‌కు వస్తుంటారు. ముచ్చుమర్రి, నెహ్రునగర్‌, కొండాపాటూర్‌, కొణిదెల, నందికొట్కూర్‌ ప్రజలు కృష్ణానది మీదుగా మర బోటు ప్రయాణం చేసి పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామానికి చే రుకొని కొల్లాపూర్‌కు వస్తుంటారు. వీరు నది దాటితే తప్ప తమ గమ్యస్థా నాలకు చేరని పరిస్థితి ఉండటంతో, ప్రమాదమైనా మరబోటుపై ప్రయా ణం చేస్తున్నారు.

జూరాల, సుంకేసుల బ్యారేజీల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో, ప్రస్తుతం కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ స మయంలో నదిలో ప్రయాణం అత్యంత ప్రమాదకరం. అయినా మరబోటు నిర్వాహకులు ప్రయాణికులను ఎక్కించు కొని, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు చేరవేస్తున్నారు. ఆదివారం పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామం నుం చి రాయలసీమలోని నె హ్రునగర్‌కు మరబోటులో స్థాయికి మించి ప్ర జలను, వాహనాలను తరలిస్తున్న బోటును చూసి కొంత మంది ఆం దోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో మరబోటులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎవరికీ లైవ్‌ జాకెట్లు కూడా ఇవ్వలేదు. ఇలాగే 2007లో రాయలసీమ నుంచి తెలంగాణ ప్రాంతానికి మరబో టులో వస్తున్న 61 మంది జల సమాధి అయ్యారు. అయినా, అధికారులకు కనువిప్పు కలగటం లేదు. ప్రమాదకరమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా రెవెన్యూ, పోలీస్‌ అధికా రులు దీని పై సీరియస్‌గా స్పందించడం లేదు. న ది ఉగ్ర రూపం దాల్చినప్పుడు మరబోటు ప్ర యాణాలను నిషేధించాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.

Updated Date - 2021-07-27T04:22:55+05:30 IST