చట్టాలపై అవగాహన పెంపొందించుకుంటే

ABN , First Publish Date - 2021-10-28T05:17:16+05:30 IST

చట్టాలపై అవగాహన పెంపొందించుకుంటే సమాజంలో గౌరవం పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జూనియర్‌ సివిల్‌జడ్జి రాధారాణి పేర్కొన్నారు.

చట్టాలపై అవగాహన పెంపొందించుకుంటే
సమావేశంలో మాట్లాడుతున్న జూనియర్‌ సివిల్‌జడ్జి రాధారాణి

సమాజంలో గౌరవం పెరుగుతుంది

అవగాహన సదస్సులో జడ్జి రాధారాణి

ఖాజీపేట, అక్టోబరు 27: చట్టాలపై అవగాహన పెంపొందించుకుంటే సమాజంలో గౌరవం పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జూనియర్‌ సివిల్‌జడ్జి రాధారాణి పేర్కొన్నారు. అప్పనపల్లె ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ విద్యార్థిదశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చట్టానికి లోబడి అందరూ మెలగాలన్నారు.

చిన్నపిల్లలచేత ప్రమాదపు పనులు చేయించరాదన్నారు. ప్రతి పిల్లవాడు బడికి వెళ్లి చదువుకోవాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులు ఆమెను సన్మానించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కుళాయప్ప, ప్రధానోపాధ్యాయులు రవిబాబు, న్యాయవాదులు రవిశేఖర్‌, కేకేచారి, ప్రభాకర్‌, సుబ్బయ్య, వెంకటసుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పులివెందులలో ఓపెన్‌ హౌస్‌

పులివెందుల టౌన్‌, అక్టోబరు 27: ప్రతి ఒక్క రూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పులివెందుల అర్బన్‌ సీఐ భాస్కర్‌రెడ్డి విద్యా ర్థులకు సూచించారు. అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని బుధ వారం పట్టణంలోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌, సత్రం పాఠశాల విద్యార్థుల కు ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు. వార్డు/గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులు, స్టేషన్‌ రికార్డు లు, ఆయుధాలు, లాకప్‌ గది గురిం చి అవగాహన కల్పించారు.

స్టేషన్‌ రికార్డులను అమలు చేసే విధానం గురించి సీఐ వివరించారు. అనంత రం వైర్‌లెస్‌ సెట్‌పై అవగాహన కల్పిస్తూ ప్రతి విద్యార్థితో సెట్‌లో రిపీటర్‌తో మాట్లా డించారు. పిస్టల్‌ ఆపరేట్‌ చేసే విధానం గురించి, తీసుకునే జాగ్రత్తలను వివరించా రు. క్రమశిక్షణను కలిగి చదువులో గొప్ప ప్రతిభను కనబరిచి ఉన్నత చదువులను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

Updated Date - 2021-10-28T05:17:16+05:30 IST