‘పనులు చేయకుంటే చర్యలు తప్పవు’

ABN , First Publish Date - 2020-05-21T09:36:17+05:30 IST

మణికొండ మున్సిపాలిటీ కార్యాలయాన్ని బుధవారం రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సందర్శించారు. గతంలో జరిగిన కౌన్సిల్‌

‘పనులు చేయకుంటే చర్యలు తప్పవు’

నార్సింగ్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): మణికొండ మున్సిపాలిటీ కార్యాలయాన్ని బుధవారం రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సందర్శించారు. గతంలో జరిగిన కౌన్సిల్‌ సమావేశ తీర్మానాల కాపీలను ఆయన తనిఖీ చేశారు. మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతరత్రా విషయాలను కమిషనర్‌ జయంత్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కస్తూరి నరేందర్‌ను అడిగి తెలుసుకున్నారు.


అభివృద్ధి పనుల కేటాయింపులో ఎలాంటి వివాదాలు ఉండకూడదని ఆయన సూచించారు. దోమలు, ఇతర అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, నెక్నాంపూర్‌ ప్రాంతంలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందని ఆయన వారి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. మున్సిపల్‌ కొత్త చట్టం ప్రకారం పనుల పట్ల నిర్లక్ష్యం వహించినా, పనులు చేయకపోయినా, ప్రజా ప్రతినిధులు స్పందించకపోయినా జిల్లా కలెక్టర్‌కు చర్యలు తీసుకొనే అధికారం ఉంద ని అన్నారు. అనంతరం ఆయన నెక్నాంపూర్‌ చెరువును పరిశీలించారు. 

Updated Date - 2020-05-21T09:36:17+05:30 IST