Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 22 May 2022 02:24:28 IST

ఓ అమ్మాయి వెంట పడితే...!

twitter-iconwatsapp-iconfb-icon

హుషారు, రౌడీ బోయ్స్‌ చిత్రాలలో కీలక పాత్రలు పోషించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నాడు తేజ్‌ కూరపాటి. తను హీరోగా నటిస్తున్న చిత్రం ‘నావెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’. అఖిల ఆకర్ష కథానాయిక. వెంకట్‌ వందెల దర్శకుడు. ఈ సందర్భంగా తేజ్‌ మాట్లాడుతూ ‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. అన్నపూర్ణ స్డూడియోస్‌లో డైరక్షన్‌ కోర్స్‌ చేశాను. ‘నాన్న నేను బాయ్‌ ఫ్రెండ్స్‌’, ‘డీజే’ చిత్రాలకు పనిచేశాను. ‘హుషారు’, ‘రౌడీ బోయ్స్‌’ సినిమాల్లో నటించా. ‘రౌడీ బోయ్స్‌’లో నా నటన నచ్చి ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’లో హీరో అవకాశం ఇచ్చారు. ఇదో పల్లెటూరి ప్రేమకథ. ఓ అబ్బాయి.. ఓ అమ్మాయి వెంట పడతాడు. ఈ విషయం ఆ అమ్మాయికి తప్ప, ఊర్లోవాళ్లందరికీ తెలుస్తుంది. దాని వల్ల ఆ అమ్మాయి ఎలాంటి ఇబ్బందుల్లో పడింది? వారిద్దరూ ఎలా కలుసుకొన్నారు? అనేదే ఈ చిత్ర కథ. పాటలు బాగా వచ్చాయి’’ అన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International