కడప: కడప జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఇడుపుల పాయ చేరుకున్నారు. జగన్, శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి వైఎస్సార్ ఫూట్‌కు చేరుకొని వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించి ప్రార్థనలో పాల్గొననున్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి బయలుదేరి 1:40 గంటల ప్రాంతంలో పులివెందులలోని బాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకొని అక్కడి నుంచి ఇండస్ర్టియల్ పార్కుకు వెళతారు. అక్కడ ఆదిత్యా బిర్లా యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. 2:40 గంటల ప్రాంతంలో వైఎస్సార్ జగనన్న హౌసింగ్‌కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. 3:35గంటలకు మార్కెట్ యార్డు చేరుకొని వివిధ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారు. 4:05గంటల ప్రాంతంలో మోడల్ పోలీస్‌స్టేషన్‌ను, 4:15 గంటలకు రాణితోపు సమీపంలో ఫిష్ హబ్‌ను సీఎం ప్రారంభిస్తారు.
ఇవి కూడా చదవండి