ఇడ్లీ
ABN , First Publish Date - 2022-02-05T19:22:12+05:30 IST
అన్నం - రెండు కప్పులు, ఇడ్లీ రవ్వ - ఒక కప్పు, ఉప్పు - తగినంత.
కావలసినవి: అన్నం - రెండు కప్పులు, ఇడ్లీ రవ్వ - ఒక కప్పు, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: ఒక గంట ముందు ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి.తరువాత మిక్సీలో అన్నం వేసి మెత్తగా పట్టుకోవాలి. అందులో నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను వేసి బాగా కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి.ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి మిశ్రమాన్ని వేసి ఇడ్లీ కుక్కర్లో ఉడికించుకోవాలి.చట్నీతో వేడి వేడి అన్నం ఇడ్లీలను తినాలి.