విమానంలో ఇడ్లీ-సాంబారు

ABN , First Publish Date - 2022-05-23T18:44:10+05:30 IST

విమానంలో వెడుతూ దక్షిణభారత శైలి ఇడ్లీ సాంబారు ఆస్వాదించాలనుకుంటున్నారా..? త్వరలోనే అటువంటి అనుభూతిని పొందవచ్చు. వేడినీటిలో

విమానంలో ఇడ్లీ-సాంబారు

మైసూరు సీఎఫ్‌టీఆర్‌ఐ కొత్త పరిశోధన  

బెంగళూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): విమానంలో వెడుతూ దక్షిణభారత శైలి ఇడ్లీ సాంబారు ఆస్వాదించాలనుకుంటున్నారా..? త్వరలోనే అటువంటి అనుభూతిని పొందవచ్చు. వేడినీటిలో కేవలం 4 నిమిషాలలో ఈ ఆహారాన్ని సిద్ధం చేసే సాంకేతికతను మైసూరులోని కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా విభాగం (సీఎఫ్‌టీఆర్‌ఐ) రూపొందించింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తమ ప్రయాణీకులకు ఇడ్లి - సాంబారు అందించేందుకు సిద్ధమైంది. విమానాలలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయనే కారణంతో వంట తయారీ చేసే విధానం ఉండదు. కానీ సీఎఫ్‌టీఆర్‌ఐ కొత్త పరి జ్ఞానంతో సంస్కరించిన ఆహారాన్ని సిద్ధం చేసే విధానం రూపొందించింది. ఆహార పొడిని వేడినీటిలో కొద్దిసేపు ఉంచడం ద్వారా ఉప్మా, అటుకుల ఉప్మా తయారు కానుంది. ప్రస్తుతం ఇడ్లి- సాంబారు పొడిని వేడి నీటిలో వేయడం ద్వారా రుచి-శుచి కల్గిన టిఫిన్‌ సిద్ధం కానుంది. కర్ణాటక, తమిళనాడు తరహాలోనే సాం బారుపొడిని సిద్ధం చేశారు. సాంబారుపొడిని వేడినీటిలో వేస్తే సిద్ధమవుతుంది. సంస్కరించిన ఇడ్లి పొడిని సాంబారులో వేయడం ద్వారా 4 నిమిషాలలో తయారుకానుంది. దక్షిణభారత్‌లో మాత్రమే ఇష్టమైన ఇడ్లి ఇకపై దేశమంతటా అందుబాటులోకి రా నుంది. ఇప్పటివరకు కోల్డ్‌ కాఫీ కొన్ని స్టాళ్లలో మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతం కూల్‌డ్రింక్స్‌ తరహాలోనే ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉంచుకుని కోల్డ్‌ కాఫీ సేవించవచ్చు. యాంటిఆక్సిడెంట్‌ కోల్డ్‌ కాఫీ ని సీఎఫ్‌టీఆర్‌ఐ ఆవిష్కరించింది. సాధారణంగా సేవించే పళ్లను ఐదింతలకాలం నిల్వ ఉంచుకుని తాజాదనంతోనే ఆరగించే కట్‌ ఫ్రూట్‌ విధానాన్ని రూపొందించారు. ఇలా సీఎఫ్‌టీఆర్‌ఐ ఆధ్వర్యంలో మరిన్ని సాంకేతిక ఆవిష్కరణలు రానున్నాయి. 

Updated Date - 2022-05-23T18:44:10+05:30 IST