Sep 25 2021 @ 16:39PM

‘ఇదే మా కథ’కు విడుదల తేదీ ఫిక్స్

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో రోడ్ జ‌ర్నీ చిత్రంగా రూపొందుతోన్న చిత్రం ‘ఇదే మా కథ’. ప్రపంచంలోని చాలా మంది వ్యక్తుల‌కు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. అలా విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్‌ రైడర్లు తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమై ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? గమ్యానికి ఎలా చేరుకున్నారు? అనే క‌థాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. గురు పవన్ దర్శకత్వంలో శ్రీ‌మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్‌లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌రు 2న‌ విడుదల చేయ‌నున్న‌ట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.