Viral Video: 22 అడుగుల పొడవు.. 75 కిలోల బరువున్న కొండచిలువ.. ఈ కొబ్బరి చెట్టును ఎలా ఎక్కేస్తోందో చూడండి..!

ABN , First Publish Date - 2021-11-17T21:33:14+05:30 IST

ఓ భారీ కొండ చిలువ అత్యంత చాకచక్యంగా కొబ్బరి చెట్టు ఎక్కుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: 22 అడుగుల పొడవు.. 75 కిలోల బరువున్న కొండచిలువ.. ఈ కొబ్బరి చెట్టును ఎలా ఎక్కేస్తోందో చూడండి..!

ఓ భారీ కొండ చిలువ అత్యంత చాకచక్యంగా కొబ్బరి చెట్టు ఎక్కుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎప్పటిది, ఎక్కడది అనే విషయాల్లో స్పష్టత లేదు. అయితే 22 అడుగుల పొడవు.. 75 కిలోల బరువున్న భారీ కొండచిలువ కొబ్బరి చెట్టు ఎక్కుతున్న తీరు వీక్షకులను విస్మయ పరుస్తోంది. 


సాధారణంగా కొబ్బరి చెట్లు ఎక్కడం పాములకు, కొండ చిలువలకు కష్టంతో కూడుకున్న పని. కొమ్మలు లేకుండా, నునుపుగా ఉండే కొబ్బరి చెట్లను కొండ చిలువలు ఎక్కలేవు. అయితే ఈ వీడియోలో కొండ చిలువ కొబ్బరి చెట్టు ఎక్కేందుకు ఉపయోగించిన టెక్నిక్ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.. 




Updated Date - 2021-11-17T21:33:14+05:30 IST