గాయని హరిణి తండ్రి..ఏకే రావుది హత్యే?

ABN , First Publish Date - 2021-11-27T08:44:04+05:30 IST

ప్రముఖ గాయని హరిణి తండ్రి, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌స(ఐఎ్‌సబీ) విశ్రాంత డైరెక్టర్‌ ఏకే రావు(64) అనుమానాస్పద మృతి కేసును

గాయని హరిణి తండ్రి..ఏకే రావుది హత్యే?

  • పోస్టుమార్టం నివేదికతో గుర్తింపు?
  • వ్యాపార లావాదేవీలే కారణమా? 
  • అదుపులో ఒకరు.. దర్యాప్తు ముమ్మరం


హైదరాబాద్‌ సిటీ, బెంగళూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాయని హరిణి తండ్రి, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌స(ఐఎ్‌సబీ) విశ్రాంత డైరెక్టర్‌ ఏకే రావు(64) అనుమానాస్పద మృతి కేసును.. బెంగళూరు పోలీసులు హత్యగా భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ నెల 22న బెంగళూరు శివారు.. యెలహంక-రాజనుకుంటే మధ్య రైల్వేట్రాక్‌పై ఆయన మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆయన మృతదేహాన్ని గురువారం గుర్తించారు. బెంగళూరు రూరల్‌ రైల్వే పోలీసులు.. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా.. శుక్రవారం నుంచి హత్యకోణంపై దృష్టి సారించారు. చేతులు, మెడపై గాట్లు ఉండడం.. సంఘటనాస్థలంలో బ్లేడు దొరకడం వంటి కారణాలకు తోడు కుటుంబ సభ్యులు కూడా ఇది హత్యే అని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయి పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. హైప్రొఫైల్‌ కేసు కావడంతో దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. రూరల్‌ రైల్వే పోలీసులతో పాటు.. బెంగళూరు పోలీసులూ సమాంతర దర్యాప్తు ప్రారంభించారు.


ఇది హత్యగానే కనిపిస్తోంది. ఆయన వారం రోజుల క్రితం నుంచి కనిపించలేదు. ఏకే రావు మృతికి వారం రోజుల ముందు నుంచి ఏదో జరిగి ఉంటుంది. ఆ వివరాలను సేకరించే బాధ్యతను ఒక బృందానికి అప్పగించాం్‌్‌ అని ఓ అధికారి తెలిపారు. ఒక రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుకు ఈ హత్య జరిగి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్‌ నుంచి ఏకే రావు కుటుంబ సభ్యులను పిలిపించారు. ఆయన ఫోన్‌ కాల్‌ డేటా రికార్డు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏకే రావు అనుమానాస్పద మృతికి.. సుద్దగుంటపాళ్య పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన రూ.150 కోట్ల చీటింగ్‌ కేసుతో లింక్‌ ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఏకే రావును గతంలో కొందరు డబ్బుల కోసం వేధించినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. డానియల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, వివేకానంద, రాఘవన్‌ అనే ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న గిరీశ్‌ అనే వ్యక్తినీ ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు సమాచారం.


బహుముఖ ప్రజ్ఞాశాలి

ఏకే రావు బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. ఆయన ఐఐటీ-బాంబే నుంచి ఇంజనీరింగ్‌ పట్టా సాధించారు. ఆ తర్వాత ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ టెక్నాలజీ నుంచి ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేశారు. 2005-09లో గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) డైరెక్టర్‌గా వ్యవహరించారు. 1991 జనవరి నుంచి 2001 జనవరి వరకు అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఆస్కీ)లో పనిచేశారు. అంతకు ముందు గ్రేట్‌ లేక్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో, సత్యం కంప్యూటర్స్‌ సర్వీసె్‌సలో కూడా సేవలందించారు. కొంత కాలంగా ఎంపీ సుజనాచౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్‌కు సీఈవోగా పనిచేస్తున్నారు.

Updated Date - 2021-11-27T08:44:04+05:30 IST