అదృశ్యమైన ఒమైక్రాన్ బాధితుడి గుర్తింపు

ABN , First Publish Date - 2021-12-15T22:37:32+05:30 IST

రాష్ట్రంలో ఒమైక్రాన్ కలకలం రేపుతోంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి

అదృశ్యమైన ఒమైక్రాన్ బాధితుడి గుర్తింపు

హైదరాబాద్: రాష్ట్రంలో ఒమైక్రాన్ కలకలం రేపుతోంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమైక్రాన్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. కెన్యా, సోమాలియా దేశాల నుంచి వారు వచ్చినట్లు గుర్తించారు. వారిలో కెన్యా నుంచి వచ్చిన యువతిని మెహదీపట్నంలోని టోలీచౌక్‌లో ఉన్నట్లు గుర్తించి టిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సోమాలియా నుంచి వచ్చిన రెండో వ్యక్తి చిరునామా మాత్రం దొరకలేదు. దీంతో అధికారులు నగరమంతా జల్లెడ పట్టారు. ఎట్టకేలకు పారామౌంట్ కాలనీలో ఒమైక్రాన్ బాధితుడు ఉన్నట్లు గుర్తించారు. తండ్రి వైద్యం కోసం ఆ యువకుడు సోమాలియా నుంచి హైదరాబాద్ వచ్చాడు. అపోలో, యశోదా ఆస్పత్రికి వైద్య కోసం తండ్రీ కొడుకు తిరిగారు. ఈ క్రమంలో రెస్టారెంట్లు, పలువురు ఇళ్లకు వారిద్దరూ వెళ్లారు. వారు ఎవరెవరినీ కలిశారు, ఎక్కడెక్కడ తిరిగారనే విషయాలను అధికారులు తెలుసుకుంటున్నారు. 




తెలంగాణలో ఒమైక్రాన్ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో రెండు ఒమైక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి. అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరికి ఒమైక్రాన్‌‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు బాధితులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి కోల్‌కతాకు వెళ్లిన మరో యువకుడి 9( పశ్చిమ బెంగాల్) ఒమైక్రాన్‌ ఉన్నట్లు గుర్తించారు. కాగా ప్రయాణికుడు వెళ్లిన తర్వాత ఒమైక్రాన్‌ వేరియంట్‌‌ను గుర్తించారు. నగరంలో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదు అవడంతో అన్నిజిల్లాల వైద్యాధికారులను తెలంగాణ సర్కార్‌ అప్రమత్తం చేసింది.


Updated Date - 2021-12-15T22:37:32+05:30 IST