ఇదేమి న్యాయం?

ABN , First Publish Date - 2021-09-03T06:17:47+05:30 IST

రాష్ట్రప్రభుత్వం పింఛనుదారులకు చెల్లించేది వేతనం కాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు వెలువరించింది. పింఛన్‌ అనేది భిక్ష కాదు హక్కు అని కూడ స్పష్టం చేసింది....

ఇదేమి న్యాయం?

రాష్ట్రప్రభుత్వం పింఛనుదారులకు చెల్లించేది వేతనం కాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు వెలువరించింది. పింఛన్‌ అనేది భిక్ష కాదు హక్కు అని కూడ స్పష్టం చేసింది. పింఛను దారులు ఉద్యోగ విరమణకు ముందు ఆదాయపు పన్ను చెల్లించేవారు. పదవీవిరమణ తర్వాత కూడ వారిని పన్ను చెల్లించమనడం, నిర్దాక్షిణ్యంగా వసూలు చేయడం అన్యాయం. ప్రభుత్వం చట్ట ప్రకారం పీఆర్‌సీలను ఆమోదించడం లేదు. అది ఆమోదించిన హెల్త్‌ కార్డులు కూడా నిరుపయోగమయ్యాయి. క్వాంటం పింఛన్‌ను కేంద్రప్రభుత్వం ఆమోదించినట్లుగా 100శాతం పెంచలేదు. రోడ్డు, రైలు మార్గాలలో ప్రయాణ ఖర్చులలో 50శాతం రాయతీల విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజాప్రతినిధులు గౌరవవేతనాలు, పింఛన్లు పెంచుకోవడం, ఆదాయపన్ను మినహాయింపు వంటి వాటన్నిటిని చట్టం ద్వారా ఆమోదింపచేసుకుంటున్నారు. తమ జీవితంలో 33 సంవత్సరాల విలువైన కాలాన్ని ప్రభుత్వ ప్రజల సేవలో గడిపిన ఉద్యోగులకు పదవీవిరమణ తర్వాత కల్పించాల్సిన సౌకర్యాలపట్ల ఉదాసీనంగా వ్యవహారించడం ప్రభుత్వానికి తగదు. చాలీచాలని పింఛన్లతో ఆదాయపన్ను కోతలతో అప్రజాస్వామికంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పింఛనుదారులకు వేదన కలిగించడం సమంజసం కాదు.

రావెళ్ళ వెంకట రామారావు, ఖమ్మం

Updated Date - 2021-09-03T06:17:47+05:30 IST