‘నన్నయ’ను ఉత్తమ వర్సిటీగా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2021-04-13T05:22:46+05:30 IST

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే ఉత్తమ వర్సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయసహకారాలు అందిస్తానని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు.

‘నన్నయ’ను ఉత్తమ వర్సిటీగా తీర్చిదిద్దుతాం
అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులుఅర్పిస్తున్న ఎంపీ భరత్‌

  • విశ్వవిద్యాలయానికి రూ.8.30 కోట్ల ‘ఖేలో ఇండియా’ నిధులు 
  • ఎంపీ మార్గాని భరత్‌.. యూనివర్శిటీ సందర్శన

దివాన్‌చెరువు, ఏప్రిల్‌ 12: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే ఉత్తమ వర్సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయసహకారాలు అందిస్తానని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. నన్నయ యూనివర్శిటీని సోమవారం ఆయన సంద ర్శించి క్రీడాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను పరిశీలించారు. ప్రాంగణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి అంజలి ఘటించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ ఖేలో ఇండియా పథకంలో విశ్వవిద్యాలయానికి తొలివిడతగా రూ8.30కోట్ల నిధులతో వివిధ పనులు చేపట్టేందుకు పరిపాలనాపరమైన ఆమోదం లభించిందన్నారు. ఇందులో రూ.4.50 కోట్లతో మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం, రూ.3.80 కోట్లతో 50 మీటర్ల సామర్థ్యంతో స్విమ్మింగ్‌పూల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో ప్రతిపాదించిన మేరకు సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌కు రెండోవిడతలో నిధులు విడుదలయ్యేట్టు కృషి చేస్తానన్నారు. వర్శిటీలో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌, మానవ వనరులకేంద్రం ఏర్పాటుకు ఉన్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తానన్నారు. వీసీ మొక్కా జగ న్నాథరావు మాట్లాడుతూ వర్శిటీలో అభివృద్ధి పనులకు గతంలో మంజూరైన రూ.40 కోట్ల నిధులు త్వరగా విడుదల చేయించేందుకు సహకరించాలని ఎంపీని కోరారు. అడ హక్‌ అధ్మాపకుల సమస్యలను అడహక్‌ సహాయాచార్యులు మణిరమణ ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎంపీని వీసీ, విశ్వవిద్యాలయ అధికార్లు ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌, ప్రిన్సిపాల్స్‌ కె,రమణేశ్వరి, వి.పెర్సిస్‌, కె.సుబ్బారావు, విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:22:46+05:30 IST